ఉత్తరాఖండ్‌లో భూకంపం, భయంతో పరుగులు తీసిన జనం
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.2గా నమోదైంది. మంగళవారం రాత్రి పూట ఈ ప్రకంపనలు సంభవించాయి. నష్టం వివరాలు అందాల్సి ఉంది.

భూకంపంతో ప్రజలు ఇళ్ళ నుండి బయటకు భయంతో పరుగులు తీశారు. అయితే ఎంత ప్రాణనష్టం, ఆస్థినష్టం సంబవించిందనే విషయమై పూర్తి వివరాలు రావాల్సి ఉందని అదికారులు ప్రకటించారు.
హిమాలయ పర్వత ప్రాంతాల్లో భూకంప కేంద్రం నమోదైందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో గతంలో నాలుగు భూకంపాలు చోటుచేసుకొన్న విషయాన్ని అదికారులు గుర్తుచేస్తున్నారు.












Click it and Unblock the Notifications