ఉత్తరఖాండ్ సీఎం రాజీనామా, జేపీ నడ్డాకు పత్రం అందజేత, గవర్నర్‌తో భేటీ..

ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తన పదవీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జేపీ నడ్డాకు అందజేశారు. 4 నెలల క్రితం ఆయన సీఎం పదవీ చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న క్రమంలో రాజీనామా చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

గత మూడురోజుల నుంచి తీరత్ సింగ్ ఢిల్లీలోనే ఉన్నారు. బీజేపీ పెద్దలతో వరసగా సమావేశం అవుతూ బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవీ నుంచి తప్పుకోవాలని హై కమాండ్ కోరింది. దీంతో ఆయన గవర్నర్ బేబీ రాణీ మౌర్య అపాయింట్ మెంట్ కోరారు. కానీ అంతకుముందే తన పార్టీ అధ్యక్షుడు నడ్డాకు రాజీనామా లేఖను అందజేశారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు డెహ్రాడూన్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అవుతారు. కొత్త ఎల్పీ నేతను ఎన్నుకోబోతున్నారు.

Uttarakhand CM Gives Resignation Letter To BJP Chief JP Nadda

త్రివేంద్ర రావత్‌పై వ్యతిరేకత రావడంతో మార్చిలో తీరత్ సింగ్ సీఎం పదవీ చేపట్టారు. వాస్తవానికి తీరత్ సింగ్ ఎంపీ.. 6 నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. కానీ ఈ లోపే ఆయన తన సీఎం పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 10 లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండేది. వాస్తవానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉండే.. కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+