ఉత్తరాఖండ్ జలవిలయం: గల్లైంతన 136 మందీ మరణించినట్లే, 200కు పైనే మృతులు
డెహ్రూడన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో జల విలయం సంభవించి దాదాపు 15 రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ గల్లంతైనవారిలో ఎక్కువమంది ఆచూకీ దొరకలేదు. దీంతో వారంతా చనిపోయి ఉంటారని అధికారులు, రెస్క్యూ సిబ్బంది భావిస్తున్నారు.
గల్లంతైనవారిని 'చనిపోయినట్లుగా భావిస్తున్నాం' అని ప్రకటించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఫిబ్రవరి 7న ధౌలిగంగాలో మంచుచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా నది ఒప్పొంగి ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే.

ఈ జల ప్రళయానికి ఓ విద్యుత్ కేంద్రం, ఐదు వంతనెల కొట్టుకుపోగా.. మరో విద్యుత్ కేంద్రం భారీగా దెబ్బతింది. ఈ వరదల్లో 204 మంది గల్లంతయ్యారు. వీరిలో ఇప్పటి వరకు 70 మృతదేహాలను గుర్తించారు. కొందరు మృతదేహాల అవయవాలు మాత్రమే దొరకడం గమనార్హం. తవపోన్ సొరంగంలోనే 14 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 136 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.
ప్రమాదం జరిగి సుమారు 15 రోజులు కావస్తున్నా.. వీరి ఆచూకీ తెలియకపోవడంతో వారంతా మరణించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటి తర్వాత రెస్క్యూ సిబ్బంది తపోవన్ విద్యుత్ కేంద్రం సొరంగంలో చిక్కుకున్న సుమారు 16 మందిని కాపాడారు. సహాయక కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ తోపాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, స్థానిక పోలీసులు మొత్తం 1000 మంది వరకు పాల్గొన్నారు.