ఉత్తరాఖండ్ జలప్రళయం -సొరంగంలో చిక్కుకున్న 16 మందిని కాపాడిన ఐటీబీపీ
ఉత్తరాఖండ్‌లో.. సముద్రమట్టానికి 7,108అడుగుల ఎత్తువరకు విస్తరించి ఉన్న నందాదేవి హిమానినదం(మంచు పర్వతం లేదా గ్లేసియర్) ఒక్కసారిగా బద్దలుకావడం, మంచు చరియలు విరిగి పడడంతో ధౌలి గంగా నదిలో జలప్రళయం సంభవించింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ) ఆధ్వర్యంలో సహాచక చర్యలు కొనసాగుతున్నాయి.
ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలోని జోషిమఠ్ ప్రాంతంలో వాతావరణం సంక్లిష్టంగా ఉండే చోట రిషిగంగ పేరుతో పవర్ ప్రాజెక్టును నిర్మిస్తుండగా, ఒక్కసారిగా పోటెత్తిన వరదలో ప్రాజెక్టు, మరో మూడు వంతెనలు కొట్టుకుపోయాయి. జలప్రళయం దెబ్బకు రేనీ- తపోవన్ వద్ద ఉన్న పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంసమైంది. పవర్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతైనట్లు ఐటీబీపీ అధికారులు చెప్పారు. కాగా,

ఇప్పటి వరకు 10 మృతదేహాలను గుర్తించగా, పవర్ ప్రాజెక్టు టన్నెల్ లో చిక్కుకుపోయిన 16 మందిని ఐటీబీపీ బలగాలు కాపాడాయి. మిగతావారి జాడకోసం గాలిస్తున్నామని అధికారులు చెప్పారు. గల్లంతైన వారంతా బహుశా మరణించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వరద పోటెత్తిన ధౌలి గంగానది.. గంగకు ఉపనది కావడంతో అది ప్రయాణించే మార్గాల్లోని అన్ని ఊళ్లలో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.
చమోలి వరదల నేపథ్యంలో తెహ్రీ డ్రామ్ నుంచి నీటి ప్రవాహాన్ని నిలిపివేసినట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. రిషిగంగ, అలకానంద నదుల్లో పెరుగుతున్న జలాల ప్రవాహానికి మార్గం సుగమం చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. నదుల ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని అన్ని గ్రామాలను ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. అలకానంద ప్రాజెక్టులో నీటి ప్రవాహం సాధారణ స్థాయిలో ఉందన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications