ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన రద్దుపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆ తీర్పును సుప్రీంకోర్టులో శుక్రవారం సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయనస్థానం రాష్ట్రపతి పాలన రద్దుపై ఇచ్చిన తీర్పుపై ఏప్రిల్ 27 వరకు స్టే ఇచ్చింది.ఉత్తరాఖండ్‌లో రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు కేంద్రం మార్చి 27న ప్రకటించిన విషయం తెలిసిందే.

supreme court

ఇది సుప్రీంకోర్టు ఆదేశించిన చట్టానికి విరుద్ధమంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ వికె బిస్త్‌లతో కూడిన ధర్మాసనం గురువారం కొట్టివేసింది.

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేయటంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది. మరోవైపు ఏప్రిల్ 29వ తేదీన శాసనసభలో మెజారిటీని నిరూపించుకోవాలని ఆ సర్కారును ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+