వామ్మో.. మాస్క్ మూతికి కదా.. ఆ మంత్రి కాలుకి తగిలించాడు..
కరోనా కాలంలో మాస్క్ కంపల్సరీ.. రకరకాల వేరియంట్స్ వస్తున్నాయని భయపెడుతున్నారు. ఇటు శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి. అయితే కొందరు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఉత్తరాఖండ్‌కి చెందిన ఒక మంత్రి కాలు వేలికి మాస్క్ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీకి చెందిన మంత్రి స్వామి యతిశ్వరానంద్ తన మాస్క్‌ను కాలు వేలికి తగిలించారు.
సమావేశంలో పాల్గొన్న మిగతా మంత్రులు కూడా మాస్కులు ధరించలేదు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ ఫొటోపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శలు గుప్పించారు. మాస్క్ ఎక్కడ ధరించాలో అన్నది ఆ మంత్రిని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్, ఆప్ నేతలు ఎద్దేవా చేశారు. మాస్కులు ధరించకుండా సమావేశమైన మంత్రులు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మరో కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. మాస్క్‌లు ధరించని మంత్రులు, మాస్క్‌లు ధరించని పేదలకు ఎందుకు జరిమానా విధిస్తున్నారని విమర్శించారు.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
Recommended Video
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.












Click it and Unblock the Notifications