వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాగుతూ... తుపాకులతో చిందేసిన బీజేపీ ఎమ్మెల్యేపై వేటు... పార్టీ నుండి బహిష్కరణ

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్‌ హరిద్వార్-ఖాన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే కున్వర్‌ ప్రణవ్‌ సింగ్‌ నిర్వాకం వివాదస్పదమైన విషయం తెలిసిందే... ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టి పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు...తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్న ఎమ్మెల్యేను పార్టీ నుండి ఎక్సపెల్ చేసింది. ఎమ్మెల్యేను పార్టీ నుండి తొలగిస్తూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది...

మందేసి,తుపాకులతో చిందేసిన ఎమ్మెల్యే

మందేసి,తుపాకులతో చిందేసిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే కున్వర్‌ ప్రణవ్‌ సింగ్‌ రెండు రోజుల క్రితం డెహ్రాడూన్‌లోని ఓ లాడ్జి గదిలో తన అనుచరులతో కలిసి మద్యం సేవించి చిందేశాడు. ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు తుపాకులను చేతిలో పట్టుకుని నానా విన్యాసాలు చేస్తూ హంగామా చేశాడు. ఇదే సమయంలో అసభ్య పదజాలం వాడుతూ బాలీవుడ్ సాంగ్‌కు చిందులేస్తూ హల్‌చల్ చేశారు. అయితే ఈమధ్యే కాలికి సర్జరీ చేయించుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంగా వేడుకలు చేసుకునే క్రమంలో తీసిన వీడియో కాస్తా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మరోసారి వార్తల్లోకెక్కారు. దీంతో పార్టీ గతంలో ఎమ్మెల్యే చేసిన వ్యవహారానికి మూడు సస్పెండ్ చేసినా మార్పు రాకపోవడంతో పూర్తిగా పార్టీ నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నేతలు తెలిపారు.

 ఇప్పటికే మూడుసార్లు పార్టీ నుంచి సస్పెండ్... ఈసారి పూర్తిగా తొలగింపు

ఇప్పటికే మూడుసార్లు పార్టీ నుంచి సస్పెండ్... ఈసారి పూర్తిగా తొలగింపు

ప్రజాప్రతినిధిగా బాధ్యతతో మెలగాల్సిన ప్రణవ్ సింగ్‌కు ఇలాంటివేమీ కొత్త కాదు. ఇదివరకు ఎన్నో వివాదాల్లో కేంద్ర బిందువుగా మారారు. ఆ మేరకు మూడుసార్లు పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. అదలావుంటే కొద్ది నెలల కిందట ఓ జర్నలిస్టును చంపేస్తానంటూ ప్రణవ్ సింగ్ బెదిరించిన వీడియో ఒకటి బయటకొచ్చింది. అప్పుడు కూడా పార్టీ హైకమాండ్ మొట్టికాయలు వేసింది. అయితే మందేసి చిందేస్తూ తుపాకులు చేతబట్టి నానా రచ్చ చేసిన ఈ ఎమ్మెల్యే వ్యవహారం వెలుగుచూడటంతో మరోసారి పార్టీ పెద్దలు తలంటినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్‌కు గురైన ప్రణవ్ సింగ్‌దారికి రాకపోవడంతో పార్టీ నుండి పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇండోర్ ఎమ్మెల్యేపై ప్రధాని ఆగ్రహం

ఇండోర్ ఎమ్మెల్యేపై ప్రధాని ఆగ్రహం


కాగా ఇదివరకే మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్ ఎమ్మెల్యే, ఆ రాష్ట్ర పార్టీ సినియర్ నాయకుడి కుమారుడైన ఆకాశ్ విజయవర్గీయ ఓ మున్సిపల్ అధికారిని ప్రజల ముందే క్రికెట్ బ్యాట్‌తో కోట్టిన అంశం బీజేపీని ఇరకాటంలో పడేసింది. దీంతో నేరుగా ప్రధానమంత్రే రంగంలోకి దిగాడు. అకాశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పార్టీ నేతలను కోరారు. అవసరమైతే పార్టీ నుండి తొలగించాలని ఆదేశించాడు.దీంతో ఆ ఎమ్మెల్యేపై సైతం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర పార్టీ నేతలు సన్నద్దమయ్యారు.

English summary
Pranav Singh Champion, Uttarakhand's Gun-toting MLA, Expelled from BJP Champion, who is the Khanpur MLA, landed in a fresh trouble on Wednesday when a video showing him dancing with guns to a popular Bollywood number in front of his cheering supporters went viral on social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X