వ్యాక్సిన్లతోనే కరోనా అంతం- బుద్ధపూర్ణిమ వేడుకల్లో ప్రధాని మోడీ
భారత్‌లో కరోనా రెండో దశ కల్లోలం కొనసాగుతున్న వేళ బుద్ధ పూర్ణిమ వేడుకల్లో వర్చువల్ విధానంలో పాల్గొన్న ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వర్చువల్ వేసక్ గ్లోబల్ సెలబ్రేషన్స్ పేరుతో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న మోడీ కరోనాపై మరోసారి మాట్లాడారు. ప్రపంచం ఇక కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్లుగానే ఉండబోంతోందన్నారు.
ప్రపంచం ఈ శతాబ్ధంలో ఇలాంటి అంటువ్యాధి (కోవిడ్)ను చూసి ఉండదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. కరోనాను ఇంకా అర్దం చేసుకోవాలంటే భవిష్యత్తులో కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అని చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో కరోనాను అంతం చేయాలంటే వ్యాక్సిన్లదే కీలక పాత్ర అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.

మరోవైపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.77 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది. మరో మూడు రోజుల్లో మరో లక్ష డోసులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
కేంద్రం ఇప్పటివరకూ 22 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిందని తెలిపింది. ఇందులో 20.13 కోట్లు మాత్రమే వినియోగమయ్యాయని, మిగిలినవి వృధా అయ్యాయని వెల్లడించింది. జాతీయ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తున్నామని పేర్కొంది.












Click it and Unblock the Notifications