ఏటీఎం, రూ. 1.37 కోట్లు లూటీ చేశాడు: చివరికి !

ఏటీఎంలో నగదు పెట్టడానికి వెలుతన్న సమయంలో వ్యాన్ లో ఉన్న రూ. 1.37 కోట్లతో పరారైన డ్రైవర్ డోమినిక్ రాయ్ ని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని భార్య ఎల్విన్ నుంచి రూ. 79 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరు: ఏటీఎం నగదుతో పరారైన డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన డోమినిక్ రాయ్ అనే వ్యక్తిని పాత మద్రాస్ రోడ్డులోని టీన్ ఫ్యాక్టరీ దగ్గర అరెస్టు చేశామని మంగళవారం పోలీసులు చెప్పారు. బాణసవాడి సమీపంలో నివాసం ఉంటున్న డోమినిక్ రాయ్ భార్య ఎల్విన్ ను ఉప్పరపేట పోలీసులు అరెస్టు చేశారు.

అయితే ఆమె స్వయంగా పోలీసులకు లొంగిపోయారని సమాచారం. ఎల్విన్ నుంచి రూ. 79 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే మిగిలిన రూ.12 లక్షలు వారి దగ్గర లేవని పోలీసులు అంటున్నారు. ఎల్విన్ స్వయంగా పోలీసులకు లొంగిపోయారని తమిళనాడులో తలదాచుకున్నడోమినిక్ రాయ్ కు సమాచారం అందింది.

van driver who fled away with Rs. 92 lakhs recently in Bengaluru

తమిళనాడులోని కోయంబత్తూరులో తలదాచుకున్న డోమినిక్ రాయ్ బెంగళూరు చేరుకున్నాడు. అతన్ని టిన్ ఫ్యాక్టరీ సమీపంలో ఉప్పరపేట పోలీసులు అరెస్టు చేశారు. మాయం అయిన రూ. 12 లక్షలు డోమినిక్ రాయ్ దగ్గర లేదని పోలీసులు చెప్పారు.

భార్య పోలీసులకు లొంగిపోయిందని తెలుసుకున్న డోమినిక్ రాయ్ బెంగళూరు వచ్చిన వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 23వ తేదిన చిక్కపేట సమీపంలో ఏటీఎంలో నగదు పెట్టడానికి వెలుతున్న వాహనంలో ఉన్న రూ. 1.37 కోట్ల నగదుతో సహ డ్రైవర్ డోమినిక్ రాయ్ పరారైనాడు.

తరువాత అదే రోజు రాత్రి వసంతనగర్ లోని మౌంట్ కార్మల్ కాలేజ్ సమీపంలో వాహనం, సెక్యూరిటీ గార్డు గన్, రూ. 45 లక్షల నగదు (రూ.2,000 నోట్లు) వదిలి పెట్టి పరారైనాడు. అప్పటి నుంచి డోమినిక్ రాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరికి భార్య పోలీసులకు లొంగిపోవడంతో డోమినిక్ రాయ్ ని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+