భవిష్యత్‌లో అల్యూమినియం వందే భారత్ రైళ్లు-

భవిష్యత్తులో వందే భారత్ అల్యూమినియం ఎక్స్ ప్రెస్ రైళ్లు పట్టాలెక్కబోతోన్నాయి. ఇప్పటికే వీటి తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్న అత్యాధునిక వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు కొత్త రూపాన్ని సంతరించుకోనున్నాయి. మరింత అత్యాధునిక రూపాన్ని సంతరించుకోనున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎక్స్ ప్రెస్ ల కంటే మరింత మెరుగ్గా వాటిని తీర్చిదిద్దడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేపట్టింది. వాటి వేగాన్ని కూడా గణనీయంగా పెంచనుంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రాకపోకలు సాగించేలా తయారు చేయనుంది.

అపూర్వ ఆదరణ..

అపూర్వ ఆదరణ..

వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఈ రైళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉంటోంది. ఇప్పటివరకు 10 రైళ్లు వేర్వేరు రాష్ట్రాల్లో వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ సిరీస్ లో ఎనిమిదో రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తిరుగాడుతోంది.

భారీగా ఆక్యుపెన్సీ..

భారీగా ఆక్యుపెన్సీ..

సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ 140 శాతం ఆక్యుపెన్సీ రేషియోను రికార్డు చేసింది. ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ల రేట్లు రెట్టింపు అయినప్పటికీ ప్రయాణికులు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఫలితంగా వారి తాకిడి ఏ మాత్రం తగ్గట్లేదు. సమయం, వేగానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. వివిధ నగరాల మధ్య వందలాది కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించే విషయంలో సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో వందే భారత్ రైళ్లపై ఆధారపడుతున్నారు.

కోచ్ ల తయారీలో..

కోచ్ ల తయారీలో..

కొత్త కోచ్ లను తయారు చేయడం, వాటి నిర్వహణ కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయనుంది. ప్రస్తుతం చెన్నైలో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ కోచ్ లు తయారవుతున్నాయి. ఇప్పుడు ఈ బాధ్యతల నుంచి ఐసీఎఫ్ ను తప్పించనుంది కేంద్రం. కొత్త కోచ్ ల తయారీ, వాటి నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. దీనికోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టింది.

అల్యూమినియంతో..

అల్యూమినియంతో..

అల్యూమినియంతో తయారు చేసిన కోచ్ లను వందే భారత్ రైళ్ల కోసం వినియోగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 35 సంవత్సరాల పాటు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు అవసరమైన అల్యూమినియం కోచ్ లను తయారు చేయడానికి ప్రత్యేకంగా టెండర్లను ఆహ్వానించింది. కోచ్ ల తయారీ- వాటి నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 30,000 కోట్ల రూపాయలు.

100 అల్యూమినియం కోచ్ లు..

100 అల్యూమినియం కోచ్ లు..

100 రైళ్లకు సరిపడే అల్యూమినియం కోచ్ లను తయారు చేయడానికి ఫ్రాన్స్ కు చెందిన అల్ స్టొమ్, భారత్-స్విట్జర్లాండ్ సంస్థ మేధా-స్టాడ్లర్ రైల్ కన్సార్టియం బిడ్స్ ను దాఖలు చేసింది. ఈ ఒక్క కన్సార్టియం మాత్రమే బిడ్స్ వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరే సంస్థ కూడా ముందుకు రాలేదు. స్టాడ్లర్ రైల్ కు అనుబంధంగా పని చేస్తోన్న హైదరాబాద్ కు చెందిన మీడియా సర్వో డ్రైవ్స్..ఈ కన్సార్టియంలో భాగస్వామిగా ఉంది.

గేమ్ ఛేంజర్..

గేమ్ ఛేంజర్..

మున్ముందు అందుబాటులోకి రానున్న అల్యూమినియం వందే భారత్ రైళ్లు.. ఓ గేమ్ ఛేంజర్ గా మారుతాయని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మాజీ జనరల్ మేనేజర్ సుధాంశు మణి అన్నారు. ప్రస్తుతం వందే భారత్ కోచ్ లను ఈ ఫ్యాక్టరీనే తయారు చేస్తోన్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో విదేశీ రైల్వే సంస్థలు కూడా ఇదే సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే అవకాశం లేకపోలేదని ఆయన వ్యాఖ్యానించారు. 30,000 కోట్ల రూపాయల విలువ చేసే టెండర్లను ఆహ్వానించడం సామాన్యమైన విషయం కాదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+