నలుగురిని బలి తీసుకున్న వందే భారత్..!!
బీహార్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వందే భారత్ రైలు ఢీకొని నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తోన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో పూర్ణియా జిల్లా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కస్బా జబాన్ పూర్ వద్ద వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని నలుగురు యువకులు మృతి చెందారు. కటిహార్-జోగ్బని రైల్వే ట్రాక్‌పై ఈ ప్రమాదం జరిగింది. రైలు వేగం చాలా ఎక్కువగా ఉండడంతో మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గుర్తు పట్టడానికి వీల్లేకుండా మారాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

దసరా ఉత్సవాలు చూసి తిరిగి వస్తున్న అయిదుమంది యువకులు ఈ తెల్లవారు జామున 4:30 గంటల ప్రాంతంలో కస్బా జబన్‌పూర్ వద్ద రైల్వే ట్రాక్ దాటుతుండగా అతి వేగంగా వచ్చిన వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు యువకులు కూడా అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. రైలు వేగంగా రావడంతో కనీసం తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది వారికి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం పూర్ణియాలోని జీఎంసీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. కొత్తగా ప్రారంభమైన వందే భారత్ రైలుతో ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేదని చెబుతున్నారు.
ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు దావానలంలా వ్యాపించడంతో వందలాది మంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సైతం సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. రైల్వే ట్రాక్‌ల వద్ద భద్రతా చర్యలపై చర్చ జరుగుతోంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ కిందటి నెల 15న వర్చువల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఎక్స్ ప్రెస్.. బిహార్ లో వెనుకపడ్డ సీమాంచల్ (జోగ్బని) ప్రాంతాన్ని పాట్నా (దానాపూర్)తో అనుసంధానిస్తుంది.












Click it and Unblock the Notifications