రైల్వే అదిరిపోయే శుభవార్త.. త్వరలో వందే భారత్ మెట్రో రైళ్ళు, ప్రత్యేకతలివే!

భారతీయ రైల్వే పైన కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. రైల్వేను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తూ టెక్నాలజీతో హై స్పీడ్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు భారతీయ రైల్వే ఇన్నోవేషన్ కి సరికొత్త అర్ధాన్ని చెబుతున్నాయి. ఇప్పటికే ప్రయాణికులను తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలకు చేరవేయడం లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లతో ఆ పని చేస్తుంది.

త్వరలో తొలి వందే భారత్ మెట్రో రైలు
ఇక ఇదే క్రమంలో మళ్లీ మరో కొత్త మోడల్ రైళ్ళను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. వందే భారత్ మెట్రో రైళ్ళను ప్రారంభించాలని రైల్వే శాఖ సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే భారతదేశపు మొట్టమొదటి వందే భారత మెట్రో రైలు సెప్టెంబర్ 16వ తేదీన ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ అహ్మదాబాద్ మార్గంలో మొదట నడవనుంది.

Vande Bharat Metro trains coming soon super features first train in gujarat

తొలి వందేభారత్ మెట్రో రైలు షెడ్యూల్ ఇదే
వారానికి ఆరు రోజులు పాటు ఈ రైలు నడవనుంది. ప్రతిరోజు రైలు భుజ్ నుండి ఉదయం 5.05 నిమిషాలకు బయలుదేరి 1050 నిమిషాలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు అహ్మదాబాద్ లో బయలుదేరి 11.10 నిమిషాలకు భుజ్ చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం ఐదు గంటల 45నిమిషాలలో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. మొత్తం తొమ్మిది స్టేషన్లలో రెండు నిమిషాల పాటు రైలు హాల్టింగ్ తీసుకుంటుంది.

వందే భారత్ మెట్రో విశేషాలు, ప్రత్యేకతలు ఇవే
తక్కువ సమయంలో ప్రయాణాన్ని పూర్తి చేయడంతో పాటు ఈ వందే భారత్ మెట్రో రైలులో విశేషాలు దానిలో ఉండే ప్రత్యేకతల విషయానికి వస్తే వందే భారత్ రైలు మాదిరిగానే ఈ వందే భారత్ మెట్రో ట్రైన్ కూడా పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ట్రైన్. ఈ రైళ్లకు ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. నాలుగు కోచ్ లు కలిపి ఒక యూనిట్ గా ఉంటాయి.

100 కిలోమీటర్ల నుండి 250 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ మెట్రో
ఆటోమెటిగ్గా డోర్లు తెరుచుకోవడం మూసుకోవడం ఈ రైలుకు ఉండే ప్రత్యేకత. మొదట ఈ రైలును 12 కోచ్ లతో ప్రారంభిస్తున్నారు. ఇక ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 16 కోచ్ ల వరకు విస్తరించే అవకాశం ఉంది. ఈ రైలు 100 కిలోమీటర్ల నుండి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేలా రూపొందించారు. ఇక గుజరాత్ లో మొదలవుతున్న ఈ వందే భారత్ మెట్రో సక్సెస్ అయితే దేశవ్యాప్తంగానూ వందే భారత్ మెట్రో రైళ్ళను విస్తరించే అవకాశం లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+