వరల్డ్ క్లాస్ వందే భారత్ స్లీపర్: థర్డ్ క్లాస్ మైండ్ సెట్: ఇక మీరు మారరా
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న పశ్చిమ బెంగాల్, అస్సాంలను కనెక్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు శ్రీకారం చుట్టింది. మొట్టమొదటి వందే భారత్ స్లీపర్.. హౌరా- కామాఖ్య రూట్ లో పట్టాలెక్కింది. దీని తర్వాత తిరువనంతపురం-చెన్నై, తిరువనంతపురం-బెంగళూరు, తిరువనంతపురం- హైదరాబాద్ మధ్య ఈ మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లు పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్టీపర్ రైలు మొదటి రోజు ప్రయాణంలోనే తీవ్ర నిర్లక్ష్యం కనిపించింది. బోగీ అంతటా చెల్లాచెదురుగా పడి ఉన్న ఖాళీ కప్పులు, ఇతర వ్యర్థాలు షాక్ కు గురి చేశాయి. వీటన్నింటినీ ఓ వ్లాగర్ తన కెమెరాలో చిత్రీకరించాడు. డస్ట్ బిన్స్ ఉన్నా వాటిని ఉపయోగించలేదు. ఎక్కడికక్కడ పడిన చెత్తను చూపించాడు. తొలి రోజు ప్రయాణంలోనే ఇంత చెత్త పేరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలకు ఉన్న సివిక్ సెన్స్ అనేది ఈ చెత్త కంటే అధ్వాన్నంగా ఉందని వ్యాఖ్యానించాడు.

ఇది ఎవరి తప్పు? రైల్వేదా, ప్రభుత్వానిదా లేదా మనదా అని ప్రశ్నించాడు. వరల్డ్ క్లాస్ వందే భారత్ స్లీపర్ రైలు బోగీలను కొందరు ప్రయాణికులు మొదటి రోజే చెత్తమయం చేయడం సమంజసం కాదని అన్నాడు. రైలంతా తిరిగి వచ్చానని, ప్రయాణీకులు తమ ఖాళీ బాటర్ బాటిళ్లు, పేపర్ ప్లేట్స్, టీ కప్స్, పేపర్ నేప్ కిన్స్.. ఎక్కడికక్కడ వదిలేశారని ఆ వ్లాగర్ వివరించాడు.
దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రపంచ స్థాయి రైలు అయినా, మన మెంటాలిటీ, మైండ్ సెట్, బిహేవియర్ మాత్రం థర్డ్ క్లాస్ గా ఉందని పేర్కొన్నాడు. ఎంతోకాలంగా వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ కోసం ఎదురు చూశామని, తొలి రోజు ప్రయాణం కోసం ముందుగానే టికెట్లను బుక్ చేసుకున్నానని, ఈ జర్నీ ఓ మధురానుభూతిగా నిలుస్తుందని భావించినప్పటికీ- వాస్తవ పరిస్థితులు ఆవేదనకు గురి చేశాయని అన్నాడు. అందుబాటులో ఉన్న డస్ట్ బిన్స్ కూడా వాడుకోలేనంత బద్ధకంలో పడిపోయామని చెప్పాడు.












Click it and Unblock the Notifications