ఇగ్నో నుంచి గోల్డ్‌మెడల్ సాధించిన ఖైదీ
న్యూఢిల్లీ/వారణాసి: ఓ ఖైదీ తన ప్రతిభకు పదును పెట్టి అరుదైన గౌరవాన్ని పొందాడు. వారణాసి జైలులో ఉన్న ఓ 23 ఏళ్ల ఖైదీ.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) నుంచి డిప్లొమా ఇన్ టూరిజం స్టడీస్‌లో బంగారం పతకం సాధించి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అజిత్‌కుమార్ సరోజ్ బనారస్ హిందూ యూనివర్సిటీలో డిప్లొమా పూర్తి చేశాడు. ఇగ్నో 28వ స్నాతకోత్సవం సందర్భంగా అతడికి శనివారం అవార్డు ప్రదానం చేశారు.

డాక్టర్ రాం మనోహర్ లోహియా అవద్ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ జీసీ జైస్వాల్ అతడికి బంగారు పతకం అందిస్తూ ఇగ్నో రూపొందించిన అజిత్ బయోడేటా చదివి వినిపించారు. హత్యకేసులో పదేళ్ల శిక్ష పడిన అజిత్ 2012 నుంచి వారణాసి జైలులో ఖైదీగా ఉన్నాడు.
ఈ క్రమంలో ఇగ్నో అందిస్తున్న ఏడాది కోర్సు డిప్లొమా ఇన్ టూరిజం స్టడీస్‌పై దృష్టిపెట్టిన అజిత్ సబ్జెక్టులో టాపర్‌గా నిలిచాడు. ఇగ్నో వారణాసి 20 జిల్లాల పరిధిలో 6వేల మంది విద్యార్థులు చదువుతుండగా బంగారు పతకం సాధించిన తొలిఖైదీ అజిత్ అని రీజియన్ డైరెక్టర్ ఏఎన్ త్రిపాఠి వెల్లడించారు. కాగా, గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ఖైదీ కుటుంసభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications