పడగవిప్పిన కాలుష్యం: బెంగళూరులో నురగ బీభత్సం, ఆందోళన(వీడియో)
కర్ణాటక రాజధాని బెంగళూరులో కాలుష్యం పడగవిప్పింది. నగరంలోని బెల్లందూర్ సరస్సులో భారీ ఎత్తులో కలుస్తున్న రసాయన వ్యర్థాల వల్ల ఏర్పడిన నురగ ప్రమాద స్థాయికి చేరుకుంది. దీంతో నగర రోడ్లన్నీ నురగమయమై సగటు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కాలుష్యం పడగవిప్పింది. నగరంలోని బెల్లందూర్ సరస్సులో భారీ ఎత్తులో కలుస్తున్న రసాయన వ్యర్థాల వల్ల ఏర్పడిన నురగ ప్రమాద స్థాయికి చేరుకుంది. దీంతో నగర రోడ్లన్నీ నురగమయమై సగటు నగరవాసిని ఆందోళనకు గురిచేస్తోంది.
రాకాసి నురగ
భారీ దూదిపింజల్లా కనిపించే ఈ రాకాసి నురగ రోడ్లపైకి దూసుకొస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పాదచారులను ఇక్కట్లకు గురిచేస్తోంది.
కాలుష్యమయం
రసాయనిక, మండే స్వభావం ఉన్న నురగ రోడ్లపైకి వచ్చి వాహన రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. నురగ సమస్యపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన హరిత ట్రైబ్యునల్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశించింది.
పరిశ్రమల వ్యర్థాలే..
అంతేగాక, నురగకు కారణమవుతున్న పరిశ్రమలను తక్షణమే మూసివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బెంగళూరు నగరాన్ని ఆనుకుని ఉన్న బెల్లందూర్ సరస్సులోకి పరిశ్రమలు, వాహనాల గ్యారేజీలు వ్యర్థాలను వదులుతున్న కారణంగానే ఇలాంటి పరిస్థితి తలెత్తుతోంది.

ప్రభుత్వం చర్యలు శూన్యం
గతంలో కూడా నగరంలో ఇలాంటి నురగ బీభత్సం సృష్టించింది. నదీ పొడవునా నురగ పేరుకుపోవడం గతంలో సంచలనంగా మారింది. ఇప్పుడు అది మరింత ఉధృతం రూపం దాల్చి ఏకంగా రోడ్లపైకే వచ్చేసింది. రసాయనిక వ్యర్థాలను నదుల్లో విడుదల చేసే పరిశ్రమలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే సమస్య ఈ స్థాయికి చేరుకుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications