petrol rate:కొన్ని రాష్ట్రాలు తగ్గిస్తున్నాయ్.. మరి తెలుగు రాష్ట్రాల సంగతి ఏంటీ..?
దీపావళి పండగ వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించిన సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపుతో కాస్త ఊరట కలిగింది. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించగానే అదే బాటలో బీజేపీ పాలిత రాష్ట్రాలు నడిచాయి. పెట్రోల్, డీజిల్‌పై 7 రూపాయల మేర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్టు అసోం, త్రిపురా, కర్ణాటక, గోవా, సిక్కిం ప్రకటించాయి.. దీంతో ఆ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర 12, డీజిల్ ధర 17 రూపాయల మేర తగ్గబోతోంది.

ధరల తగ్గింపు
బీహార్‌లోని జేడీయూ-బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌పై 1.30 రూపాయలు, డీజిల్‌పై 1.90 రూపాయల మేర వ్యాట్ తగ్గించింది. ఉత్తరాఖండ్ పెట్రోల్‌పై 2 రూపాయలు తగ్గించింది. ఉత్తరప్రదేశ్ లీటర్‌పై 12 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. గుజరాత్ కూడా పెట్రోల్, డీజిల్ పై 7 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి మరింత ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు.

ఇలా ధరలు
కేంద్రం తగ్గింపుతో పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 11 రూపాయల మేర ధరలు దిగి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ పెరుగుతున్నాయి. ఇక్కడి ప్రభుత్వాలు కూడా వ్యాట్‌పై తగ్గింపు నిర్ణయం తీసుకుంటే ఇంధన ధరలు మరింత తగ్గనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్‌పై 32.5 శాతం వ్యాట్ విధిస్తోంది. కేంద్రం బాటలో నడిచి దీన్ని సవరిస్తారా? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శల వర్షం ప్రారంభించారు. ప్రభుత్వం పన్ను తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అని అడుగుతున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై ఇంకా స్పందించలేదు.

ఎక్సైజ్ డ్యూటీ..
పెట్రోల్, డీజీల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల మేర తగ్గించడంతో లక్ష కోట్ల మేర ఆదాయం తగ్గుతుంది. దేశంలో ఇంధర ధరలు అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం.. దానికి తోడు కట్టడి చేయలేని స్థితికి ద్రవ్యోల్బణం చేరుకున్నాయి. వీటికి తోడు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీని ఎప్పుడో దాటేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర అయితే ఏకంగా 120 దాటేసింది. అన్ని వైపుల నుంచి విమర్శలతో కేంద్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దీంతో మెట్టు దిగి వచ్చి ఎక్సైజ్ డ్యూటీలో కోత విధించుకుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
Recommended Video

రూ.40 పెంచి
రూ.40 పెంచి రూ.5 తగ్గించడం ఏంటీ అని ప్రతిపక్షాలు అంటున్నాయి. దానికి దీపావళి పేరు చెప్పి.. ఇంత తగ్గించడం ఏంటీ అని అడుగుతున్నారు. మరికొందరు మాత్రం పండగ అయిపోయిన తర్వాత ధరలు పెంచుతారని అంటున్నారు. ఇటు పెట్రో ధరలు కూడా వ్యాట్ పరిధిలో ఉన్నాయి. అదే జీఎస్టీ పరిధిలో ఉంటే.. ధర తగ్గేది. దానిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపక్షాలు కోరుతున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతోంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications