Vedic clock : నేడు వేద గడియారాన్ని ప్రారంభించనున్న ప్రధాని...
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు ప్రపంచంలోనే మొట్టమొదటి 'వేద గడియారాన్ని ప్రారంభించనున్నారు. ఈ గడియారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రధాని చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ గడియారం'విక్రమాదిత్య వేద గడియారం' పేరుతో సిద్ధమైంది. ఈ వేద గడియారాన్ని ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ గడియారంలో అనేక విశేషాలున్నాయి. ఇది పురాతన భారతీయ సంప్రదాయ పంచాంగం ప్రకారం పనిచేయనుంది.
ఈ వేద గడియారం భారత కాల గణన విధానం ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదని నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. భారత కాల గణన విధానం సూక్ష్మమైనదని, స్వచ్ఛమైనదని, దోషరహితమైనదని కూడా వారు వివరించారు. ప్రామాణికమైన, విశ్వసనీయత కలిగిన ఈ వ్యవస్థను ఉజ్జయినిలో వేద గడియారం రూపంలో తిరిగి ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఉజ్జయిని నుంచి సూచించిన సమయాన్నే ప్రపంచమంతా వినియోగిస్తోందని కూడా వారు వివరించారు. భారతీయ కాల గణన సంప్రదాయాన్ని ఈ క్లాక్ ద్వారా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు.

85 అడుగుల ఎత్తున్న టవర్‌పై వేద గడియారం : ఈ గడియారం ఉజ్జయినిలోని జంతర్ మంతర్ ఏరియాలో 85 అడుగుల ఎత్తున్న టవర్‌పై ఈ వేద గడియారాన్నిఅమర్చారు. నేడు అనగా శుక్రవారం ఈ గడియారాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. వేద హిందూ పంచాంగం సమాచారాన్ని ఈ 'వేద గడియారం' ప్రదర్శిస్తుంది. ఈ గడియారం సంవత్సరం, మాసం, చంద్రుడి స్థానం, శుభ గడియలు, నక్షత్రం, సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం వంటి ఇతర వివరాలను, సమాచారాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఇది కాల గణన పద్దతి ప్రకారం పనిచేస్తోంది.
ఈ గడియారం సమాయన్ని కూడా లెక్కిస్తోంది. ఒక సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం ఆధారంగా ఈ గడియారం సమయాన్ని లెక్కిస్తుంది. గ్రహాల స్థితిగతులు, ముహూర్తం, జ్యోతిష గణనలు, అంచనాలకు సంబంధించిన సమాచారాన్నిఈ గడియారంలో డిస్‌ప్లే చేస్తుంది. అంతేకాదు భారత ప్రామాణిక కాలం (IST), జీఎంటీ (GMT)లను కూడా ఈ వేద గడియారం సూచిస్తుంది.












Click it and Unblock the Notifications