Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వెంకయ్య కొత్త ఇన్నింగ్: ఏం చేయబోతున్నారు: 50 ఇయర్స్ ఇండస్ట్రీకి గుడ్ బై..!

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఇవ్వాళ్టితో ముగియబోతోంది. దేశ 13వ ఉప రాష్ట్రపతిగా ఆయన పని చేశారు. వెంకయ్య నాయుడి స్థానంలో జగ్‌దీప్ ధన్‌కర్ బాధ్యతలను స్వీకరిస్తారు. గురువారం ఆయన దేశ 14వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

వీడ్కోలు..

వీడ్కోలు..

హమీద్ అన్సారీ తరువాత ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు బాధ్యతలను స్వీకరించారు. 2017 ఆగస్టు 11వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు వీడ్కోలు కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సభ్యులు జైరామ్ రమేష్, పీ చిదంబరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభా పక్ష నాయకుడు వీ విజయసాయి రెడ్డి.. తదితరులు వెంకయ్య నాయుడి సేవలను కొనియాడారు.

బీజేపీతో అనుబంధం..

బీజేపీతో అనుబంధం..

భారతీయ జనతా పార్టీతో వెంకయ్య నాయుడికి దశాబ్దాల కాలం నాటి అనుబంధం ఉంది. 50 సంవత్సరాల పాటు ఆయన బీజేపీలో కొనసాగారు. కేంద్ర మంత్రిగా పని చేస్తోన్న సమయంలో ప్రధాని మోడీ-అమిత్ షా.. ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. గెలిపించుకున్నారు. దీనితో బీజేపీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజ్యసభలో వీడ్కోలు తీర్మానంపై ప్రసంగం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీతో అనుబంధాన్ని తెంచుకోవాల్సి వచ్చినందుకు ఆవేదనకు గురైనట్లు చెప్పుకొచ్చారు.

ఇకపై ఏం చేయబోతోన్నారు..?

ఇకపై ఏం చేయబోతోన్నారు..?

వెంకయ్య నాయుడి పదవీ కాలం ఇవ్వాళ్టితో ముగియబోతోన్నందున.. అందరి దృష్టీ ఆయన మీదే నిలిచింది. ఇకపై ఆయన ఏం చేయబోతోన్నారనేది చర్చనీయాంశమైంది. పదవీ విరమణ తరువాత మళ్లీ క్రియాశీలక రాజకీయాల వైపు మొగ్గు చూపిస్తారా?.. పరోక్షంగా బీజేపీకి తన సేవలను అందజేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ఉప రాష్ట్రపతి స్థాయిలో పని చేసిన వారు రాజకీయాల్లో పునఃప్రవేశం చేయరు. వెంకయ్య నాయుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారని చెబుతున్నారు.

పార్టీకి సేవలను అందిస్తారా?

పార్టీకి సేవలను అందిస్తారా?

సుదీర్ఘకాలం బీజేపీలో కొనసాగారు వెంకయ్య నాయుడు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు. దేశ రాజకీయాలపై గట్టి పట్టు ఉంది. ఆ అనుభవం ఉండటం వల్ల పరోక్షంగా ఆ పార్టీకి తన సేవలను అందిస్తారనే ప్రచారం కూడా ఉంది. కేంద్ర మంత్రిగా, క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతున్న సమయంలో అనూహ్యంగా ఉప రాష్ట్రపతిగా ఎంపిక అయ్యానని వెంకయ్య నాయుడు సైతం వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తోన్నారు. ఆ సేవలను కొనసాగించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

మోడీ-షా ఏం చేస్తారు..?

మోడీ-షా ఏం చేస్తారు..?

రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలపైనా వెంకయ్య నాయుడు తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కర్ణాటక, రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు పలుమార్లు ఎన్నికయ్యారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాజ్యసభలో తన వాగ్ధాటితో అధికార పక్షాన్ని చాలా సందర్భాల్లో ఇరుకున పెట్టారు. వెంకయ్య నాయుడి విషయంలో ఏం చేయాలన్నా అది ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+