వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభలో వెంకయ్య కంటతడి : నాయుడు ప్రజాజీవితంలోనే - ప్రధాని మోదీ..!!

|
Google Oneindia TeluguNews

రాజ్యసభలో భావోద్వేగం నిండుకుండి. ఛైర్మన్ హోదాలో వెంకయ్య వీడ్కోలు కార్యక్రమంలో ప్రధానితో సహా పలువురు సభ్యులు ఆయన సేవలను ప్రశంసించారు. ఛైర్మన్ సీట్లో ఉన్న వెంకయ్య సభ్యుల ప్రసంగం సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు.ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సేవలు..అంకిత భావం పైన ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. సభకు ఇది అత్యంత భావోద్వేగపరమైన క్షణం గా ప్రధాని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు కొత్త తరంతో అనుసంధానమయ్యారని ప్రధాని ప్రశంసించారు. ఆయన పని విధానం స్పూర్తి దాయకమని చెప్పారు.

వెంకయ్య పై ప్రధాని ప్రశంసలు

ఏ బాధ్యత అప్పగించినా.. వెంకయ్య దాని పైన పెట్టే శ్రద్ద..చూపించే బాధ్యత ప్రతీ ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. వెంకయ్య సమక్షంలో అనేక చారిత్రక ఘటనలు చోటు చేసుకున్నాయని ప్రధాని వివరించారు. ఆయన అనేక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారని ప్రధాని ప్రశంసించారు. వెంకయ్య నాయుడు రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నానని.. ప్రజా జీవితం నుంచి కాదనే విషయాన్ని ప్రధాని గుర్తు చేసారు. దేశంతో పాటు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకు వెంకయ్య అనుభవాల నుంచి నేర్చుకొనే అవకాశం ఎప్పటికీ ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. వెంకయ్యతో కలిసి పని చేసే అవకాశం దక్కిందన్నారు.

ఎప్పటికీ ఆదర్శవంతంగా

వెంకయ్య భాష..సంభోదన తీరు ప్రేరణ కలిగిస్తాయని చెప్పారు. వెంకయ్య జనాదరణ ఉన్న నేతగా ప్రధాని అభివర్ణించారు. వెంకయ్య భాషలో సున్నితత్వం.. గంభీరణ ఉంటాయన్నారు. వక్తి పురోగతికి ప్రాంతం - భాష అడ్డుకావాని చెప్పారు. శాసనసభ్యుడి నుంచి సుదీర్ఘ కాలం రాజ్యసభ సభ్యుడిగా ఆయన వ్యవహార శైలి ఎప్పటికీ ఆదర్శనీయమన్నారు. ఇక, ప్రతిపక్ష నేత మల్లిఖార్జు ఖర్గే తనకు వెంకయ్యతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. పార్టీల పరంగా సిద్దాంతాల్లో విభేదాలున్నా.. పరస్పర గౌరవంలో మాత్రం వెంకయ్య ఎప్పుడూ స్పూర్తిగా నిలిచారని చెప్పారు.

వెంకయ్య భావోద్వేగం

ఆయన సభాధ్యక్షుడిగా వ్యవహరించిన సమయం ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ప్రసంగిస్తున్నవేళ.. వెంకయ్య కుటుంబ నేపథ్యం..ఆయన బాల్యం కష్టాల గురించి వివరిస్తున్నప్పుడు వెంకయ్య కంట తడి పెట్టారు. భావోద్వేగానికి లోనయ్యారు. వెంకయ్య సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి..ఈ స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. ఎవరి ప్రాంతీయ భాషల్లో వారు ప్రసంగించే అరుదైన అవకాశం ఇచ్చిన వెంకయ్య తీరు అభినందీయమని చెప్పిన డీఎంకే సభ్యులు ఆయన స్నేహ పూర్వక వ్యక్తి అంటూ అభినందించారు.

English summary
PM Modi and Members of the upper house bid farewell to Chairman Venkaiah Naidu. Chirman beacame Emotional.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X