ఔదార్యం: రూపాయికే భోజనం, పదేళ్ళ నుండి కొనసాగిస్తున్న వెంకట్రామన్

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఒక్క రూపాయికి కనీసం టీ కూడ రావడం లేదు. కానీ, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని పవర్ హౌస్ రోడ్డులోని వెంకట్రామన్ అనే వ్యక్తి ఒక్క రూపాయికే రోగులకు బోజనాన్ని అందిస్తున్నాడు.

చెన్నైలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లను ప్రారంభించింది. ఈ క్యాంటీన్లలో ఐదు రూపాయాలకే ఆహరపదార్థాలను ఇస్తున్నారు.

అయితే వెంకట్రామన్ అనే వ్యక్తి పవర్ హౌస్ రోడ్డులో ఓ హోటల్ ను నిర్వహిస్తున్నాడు. ఈ హోటల్ లో కేవలం ఒక్క రూపాయికి మాత్రమే బోజనాన్ని ఇస్తున్నాడు. మూడు పూటల రూపాయికి మాత్రమే భోజనాన్ని అందిస్తున్నాడు.

venkatraman provides meal for one rupee

ఎఎంవీ హోమ్లీమెస్ ను వెంకట్రామన్ నిర్వహిస్తున్నాడు.ఈ హోటల్ ఈరోడ్ ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఉంది. ఈ హోటల్ కు వచ్చే రోగులకు వెంకట్రామన్ ఒక్క రూపాయికే పుల్ బోజనం పెడుతున్నారు.దాదాపుగా10 ఏళ్ళ నుండి వెంకట్రామన్ ఈ హోటల్ ను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాడు.

అయితే హోటల్ ను ప్రారంభించిన సమయంలో దివ్యాంగులకు బిల్లులో 20 శాతం తగ్గించేవాడు. ఈ ఆసుపత్రి ఆసుపత్రికి దగ్గరలో ఉండడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు వస్తుంటారు.దీంతో వెంకట్రామన్ ఈ నిర్ణయం తీసుకొన్నాడు.

ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ వృద్దురాలు ఇడ్లీలు కొనేందుకు డబ్బులు లేక హోటల్ నుండి తిరిగి వెళ్ళిపోవడాన్ని మనస్థాపం చెందానని చెప్పారు. అప్పటి నుండి ఆసుపత్రికి వచ్చే రోగులకు బిల్లుల్లో రాయితీని కల్పిస్తున్నట్టు చెప్పారు. తొలుత మద్యాహ్న బోజనానికి వచ్చేవారిలో 20 మందికి టోకెన్లు ఇస్తారు. వారి వద్ద ఒక్క రూపాయి వసూలు చేస్తారు.

ఉదయం పూట 15 మందికి, మధ్యాహ్నం30మందికి, రాత్రికి 15 మందికి టోకెన్లను పంపిణీ చేస్తున్నట్టు ఆసుపత్రి యజమాని వెంకట్రామన్ చెప్పారు.అయితే నష్టాన్ని భరించి రోగులకు సేవలు చేస్తున్నందున కొన్ని స్వచ్చంధసంస్థలు వెంకట్రామన్ కు విరాళాలు ఇస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
venkatraman provides meal for one rupee in tamilnadu past 10 years.venkatraman owner of amv hotel.
Please Wait while comments are loading...