బాలమురళీకృష్ణ కన్నుమూత
బాలమురళీకృష్ణ కన్నుమూత
చెన్నై: ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ (86) చెన్నైలోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం కన్ను మూశారు. ఆరేళ్ల వయసులో గాయకుడిగా సంగీత ప్రస్థానం ప్రారంభించారు. తండ్రి పట్టాభిరామయ్య వద్ద సంగీత స్వర సాధనకు శ్రీకారం చుట్టి గాత్ర సంగీతంలోనే కాక వయోలిన్, వీణ, మురళి, మృదంగం తదితర సంగీత వాయిద్యాల్లో ప్రావీణ్యం సాధించారు. ఆదునికి వాగ్గేయకారుడిగా ఆయన సంగీతానికే ఎంతో వన్నెని తీస్కుని వచ్చారు. పలు చిత్రాల్లో ఆయన గళం విని శ్రోతలు మైమరచిపోయారు. కొన్ని వేలకు పైగా కచేరీలు చేసిన ఆయన ఎన్నో రాగాలను కనిపెట్టారు. ఎన్నో బాణీలను స్వరపరిచారు. ముఖ్యంగా సరళీస్వరం, ధాటుస్వరం, థిల్లానా, ఇలా సంగీతంలో దేనినైనా సరే చాలా సులువుగా పాడేయగల విధ్యాంసుడు ఆయన. తితిదే, శృంగేరి పీఠాల ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25వేల కచేరీలు చేసిన ఘనత ఆయనది. భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు.












Click it and Unblock the Notifications