నలుగురు పిల్లలుంటే ఫైనాన్షియల్ రివార్డు: విహెచ్‌పి నేత కెపి సింగ్
కాన్పూర్: ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లలనైనా కనాలన్న భారతీయ జనతా పార్టీ ఎంపి సాక్షి మహారాజ్ వ్యాఖ్యలను తాజాగా ఓ విశ్వహిందూ పరిషత్(విహెచ్‌పి) నేత సమర్థించారు. అంతేగాక నలుగురు పిల్లలున్న వారికి ఫైనాన్షియల్ నివార్డును ప్రకటిస్తామన్నారు.
నలుగురు పిల్లలు కలిగివున్న కుటుంబానికి ఆర్థికంగా సాయాన్నందిస్తామని (ఫైనాన్షియల్ రివార్డు)విహెచ్‌పి నేత కుశాల్ పాల్ సింగ్ మంగళవారం ప్రకటించారు. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడుతూ.. రివార్డు మాత్రమే కాకుండా వారికి విద్య, ఉద్యోగవకాశాలతోపాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు.

ఇటీవలే ఎంపి సాక్షి మహారాజ్ ప్రతీ హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లలనైనా కనాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సాక్షి మాటలకు వత్తాసు పలుకుతూ సాధ్వి ప్రాచీ కూడా కనీసం నలుగురు పిల్లలను కనాలని హిందువులకు సూచించింది.
ఇది ఇలా ఉండగా ఎంపి సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలకు గాను బిజెపి అతనికి షోకాజు నోటీసు జారీ చేసింది.












Click it and Unblock the Notifications