చిరుతపులిని చేతికర్రతోనే హడలెత్తించిన వృద్ధురాలు: Leopard పరార్(వీడియో)

ముంబై: ఒక్కసారిగా పులి కళ్ల ముందు కనిపిస్తే ఎవరైనా సరే భయంతో బెంబేలెత్తిపోతారు. దాడికి దిగితే అంతే సంతేగతులు. కానీ, ఓ వృద్ధురాలు మాత్రం తనపై దాడి చేస్తున్న చిరుతపులిని ధైర్యంగా ఎదుర్కొంది. తన చేతి కర్రతో రెండు మూడు దెబ్బలు వేసి తరిమికొట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

మహారాష్ట్ర రాజధాని ముంబై శివారులోని ఆరే కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లో వెళితే.. స్థానికంగా నివసించే నిర్మలా దేవీ సింగ్ బుధవారం రాత్రి చేతి కర్ర ఊతంతో నడుచుకుంటూ వెళ్లి ఇంటి ప్రాంగణంలో గద్దెపై కూర్చున్నారు. అప్పటికే అక్కడ ఓ చిరుత పులి నక్కి ఉంది. అయితే, ఈ విషయాన్ని ఆమె గమనించలేదు.

 Video: A Woman Fights Off Leopard With Walking Stick In Mumbai

ఆమె కూర్చుకుండగానే అదును చూసి దాడి చేసింది చిరుత. ఒక్కసారిగా భయందోళనలకు గురైన 55ఏళ్ల నిర్మలాదేవీ.. వెంటనే తేరుకుని సమయస్ఫూర్తి ప్రదర్శించారు. తన చేతికర్రను తీసుకుని చిరుతను ప్రతిఘటించింది. రెండు మూడు దెబ్బలు వేయడంతో చేసేదేంలేక చిరుత అక్కడ్నుంచి పలయనం చిత్తగించింది. ఆమె అరుపులు విన్న కుటుంబసభ్యులు వచ్చారు. దీంతో జరిగిన ఘటనను వివరించింది నిర్మలా దేవి.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ వృద్ధురాలి సాహసంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిస్తున్నారు.

అయితే, చిరుతపులి దాడిలో ఆ వృద్ధురాలికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు వైద్యం అందించారు. కాగా, ఆరే కాలనీ ప్రాంతంలో చిరుత దాడి జరగడం మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో సారి కావడం గమనార్హం. ఓ నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసింది. అయితే, స్థానికులు ఆ బాలుడ్ని పులి బారి నుంచి కాపాడారు. ముంబై శివారు ప్రాంతమైన ఆరేకాలనీ చుట్టూ అటవీ ప్రాంతం ఉండటంతో.. పులులు తరచూ ఈ ప్రాంతంలోకి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+