వీడియో: పిజ్జా డెలివరీ గర్ల్‌‌పై కర్రలతో నలుగురు మహిళల దాడి, అందరూ చూశారే కానీ

ఇండోర్: ఓ యువ మహిళా డొమినోస్ పిజ్జా డెలివరీ ఉద్యోగినిని నలుగురు మహిళల బృందం వీధుల్లో దారుణంగా కొట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది.ఆ అమ్మాయి నొప్పితో ఏడుస్తూ.. రోదనలు చేసినా అక్కడున్నవారెవరూ కూడా ఆమెకు సహాయం చేయకపోవడం విచారకరం.

పిజ్జా చైన్ ఉద్యోగి తాను పోలీసులను పిలుస్తానని చెప్పినప్పుడు.. దాడిచేసిన వారిలో ఒక మహిళ "వెళ్లి ఫిర్యాదు చేయి" అంటూ విరుచుకుపడింది. కర్రలు, చేతులతో దారుణంగా కొట్టారు. కిందపడినా కూడా వదలకుండా ఆమెను కొట్టారు.

video: Group of women beat up pizza chain employee in Indore

కాగా, నందిని అనే పిజ్జా డెలివరీ ఉద్యోగినిని కొట్టిన నలుగురు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

నిందితులైన మహిళలు స్థానిక ముఠాకు చెందిన వారు. దాడికి సంబంధించిన వీడియోను ముఠా స్వయంగా వైరల్ చేసిందని ఆరోపించారు. ఈ ఘటనను కెమెరాలో చిత్రీకరించి ట్విట్టర్‌లో పంచుకున్నారు. మహిళల బృందం బాలికపై అసభ్యంగా ప్రవర్తించి మరీ కొట్టారని ప్రజలు విమర్శించారు. చివరకు సమీపంలోని నివాసంలో దాక్కుని బాలిక తనను తాను రక్షించుకుంది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమెను కొట్టిన నలుగురు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, నిందితులు తమను చూసిందనే కారణంతోనే బాధితురాలిపై దారుణంగా దాడి చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+