వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంహెచ్ 370కి ఏమైంది: భారత స్వామిజీ జోస్యం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అదృశ్యమైన మలేషియా విమానం తమకు కనిపించిందని, దానికి ఎదురైన పరిమాణాలు వివరిస్తున్నారు మనదేశంలోని ఓ స్వామిజీ, అతని శిశ్యులు. మార్చి 8న అదృశ్యమైన మలేషియా విమానం ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. 239 మంది ప్రయాణికులతోపాటు అదృశ్యమైన విమానం కోసం ఇప్పటికే 26 దేశాలకు సంబంధించిన బృందాలు తూర్పు, ఉత్తర, దక్షిణాసియా ప్రాంతాల్లో గాలిస్తున్నాయి.

ఐదు నిమిషాలు నిడివి గల కన్నడ భాషలోని ఓ వీడియోలో స్వామిజీ, అతని శిశ్యులు అదృశ్యమైన మలేషియా విమానం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అదృశ్యమైన విమానం హైజాక్ చేయబడిందని, హైజాక్ చేసిన వారిలో ఒకరికి విమానం నడిపించడం తెలుసునని మహిళా శిశ్యురాలు తెలిపింది. అయితే చివరకు ఆ విమానం సముద్రంలో పడిపోయిందని ఆమె చెప్పింది.

Video: Indian Swamiji and disciples 'find' missing Malaysian flight!

విమానంలోపలి భాగంలో పచ్చని వెలుతురు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారని, అది రాత్రి సమయమని ఆమె తెలిపారు. అయితే ఏం జరిగిందని విషయాన్ని ఆమె తెలుపలేదు.

కాగా, ఆ విమానానికి ప్రమాదం జరిగిందని, దాంతో విమానం పాడైపోయిందని మరో శిశ్యుడు తెలిపాడు. ఆ సమయంలోనే విమానంలోకి నీరు చేరుకుందని, దీంతో విమానంలోని ప్రయాణికులు చనిపోయారని అతడు పేర్కొన్నాడు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/QJ6rcB_ILKc?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
An Indian Swamiji and two of his disciples 'witnessed' the fate of the missing Malaysian flight. The plane, MH370, which took off from Kuala Lumpur for Beijing on March 8, disappeared and is yet to be found.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X