Viral Video: నడిరోడ్డుపై.. క్యాబ్ డ్రైవర్‌ను ఓ రేంజ్‌లో కొట్టిన యువతి.. బిత్తరపోయిన పబ్లిక్
ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్నోలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ అమ్మాయి క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. సినిమాల్లో హీరో లెవల్‌లో రెచ్చిపోయిన ఆ అమ్మాయి అతని చెంపల్ని చెడామడా వాయించింది. కొద్దిసేపటి వరకూ ఆపకుండా అతన్ని కొడుతూనే ఉంది. ఈ క్రమంలో అతని సెల్‌ఫోన్‌ని కూడా పగలగొట్టింది. అయితే ఆమె ఎందుకంతలా రెచ్చిపోయి కొట్టిందనేది ఎవరికీ తెలియదు.ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై కూడా స్పష్టత లేదు.
ఆమె అతన్ని కొడుతున్నంత సేపు దగ్గరికి వెళ్లడానికి కూడా చాలామంది భయపడ్డారు. ఆ క్యాబ్ డ్రైవర్ నిస్సహాయంగా దెబ్బలు తిన్నాడు తప్పితే ఎక్కడా తిరగబడలేదు. ఒకరిద్దరు ధైర్యం చేసి ఆమెను ఆపేందుకు వెళ్లగా... అందులో ఒకరిపై కూడా ఆమె దాడికి పాల్పడింది. నడిరోడ్డుపై ఆమె ఇలా దాడికి పాల్పడటంతో... వెనకాల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ వీడియో మొదట మేఘ్ అప్‌డేట్స్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ అయింది. కనీసం కారణమేంటో చెప్పకుండా క్యాబ్ డ్రైవర్‌ని ఓ అమ్మాయి కొడుతూనే ఉందంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. లక్నోలోని,అవధ్ క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన ఆ యువతిని అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్‌లో నెటిజన్లు #arrestLucknowgirl పేరిట హాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అదే యువతి స్థానంలో ఓ యువకుడు ఉండి ఉంటే ఇలాగే చూస్తూ ఊరుకునేవాళ్ల అంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పాపం ఆ క్యాబ్ డ్రైవర్ పరిస్థితి అంటూ వాపోతున్నారు.
Viral Video: A Girl Continuously Beating a Man (Driver of Car) at Awadh Crossing, Lucknow, UP and allegedly Damaging his Phone inspite of him asking for Reason pic.twitter.com/mMH7BE0wu1
— Megh Updates 🚨 (@MeghUpdates) July 31, 2021
Recommended Video
ఆ క్యాబ్ డ్రైవర్ తన కారును ఢీకొట్టినందుకే ఆమె అంతలా రెచ్చిపోయి దాడి చేసింద వాదన వినిపిస్తోంది. ఇప్పటికైతే ఈ ఘటనలో అసలేం జరిగిందనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. యూపీ పోలీసులు దీనిపై స్పందిస్తారో లేదో వేచి చూడాలి. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ఆ రౌడీ అమ్మాయికి తగిన శిక్ష విధించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications