వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మీస్ మౌత్ ఆర్గన్: ఈ ఏనుగు సంగీతం ఎంత చక్కగా వాయిస్తుందో చూడండి

|
Google Oneindia TeluguNews

సర్కస్‌లో చిందులేసే ఏనుగును చూసి ఉంటారు.. ఫుట్ బాల్ ఆడే ఏనుగును చూసిఉంటాం. రింగ్ మాస్టర్ ఏమి చెబితే ఆ పని చేసే ఏనుగును చూశాం. కానీ సంగీతం పరికరాలతో సంగీతం వాయించే ఏనుగును ఎక్కడైనా చూశారా..? ఏనుగు సంగీతం వాయించడమేంటి అనేగా మీ అనుమానం.. మీ అనుమానం నివృత్తి కావాలంటే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చదవాల్సిందే.

మౌత్ ఆర్గన్ వాయిస్తున్న లక్ష్మీ

మౌత్ ఆర్గన్ వాయిస్తున్న లక్ష్మీ

తమిళనాడు రాష్ట్రం కోయంబతూరులో ఏనుగులు నడిరోడ్డపైనే సంచరిస్తుంటాయి. వాటిని చూస్తే చాలామంది పాదాచారులు దూరంగా పరుగులు తీస్తారు. కానీ అక్కడే పుట్టి ఓ ఆలయంలో పెరిగిన ఏనుగు మాత్రం సంగీత విద్వాంసురాలుగా అవతరించింది. ఇదిగో ఫోటోలో కనిపిస్తున్న ఏనుగు పేరు లక్ష్మీ. ప్రస్తుతం ఇది ఓ సంరక్షణ కేంద్రంలో ఉంది. ఇన్ని రోజులు ఓ ఆలయంలో సేవలందించిన లక్ష్మీ ఆలయానికి వచ్చి వెళ్లే భక్తులకు తన సంగీతాన్ని వినిపించేది. భక్తులు లక్ష్మీ సంగీతాన్ని ఎంతో ఆస్వాదించేవారు కూడా. అంతేకాదు కేవలం సంగీతం వినేందుకే ఆలయానికి భక్తులు వస్తున్నారంటే లక్ష్మీ అనే ఈ ఏనుగు ఎంత చక్కగా మౌత్ ఆర్గన్ వాయిస్తుందో ఊహించొచ్చు.

సందర్శకులను ఆకట్టుకుంటున్న లక్ష్మీ

సందర్శకులను ఆకట్టుకుంటున్న లక్ష్మీ

ఇక సంరక్షణ కేంద్రంలో ఉన్న ఏనుగును చాలామంది వచ్చి చూసిపోతున్నారు. ప్రతస్తుతం తెక్కంపట్టిలో లక్ష్మీ ఉంది. అక్కడికి వచ్చే సందర్శకులకు తన టాలెంట్ చూపుతోంది లక్ష్మీ. లక్ష్మీ వాయిస్తున్న పసందైన సంగీతానికి సందర్శకులు ఫిదా అయిపోతున్నారు. ఏనుగు వాయిస్తున్న సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. మరి ఏనుగు మౌత్ ఆర్గన్ వాయించడం సొంతంగా నేర్చుకుందా అంటే కాదు. లక్ష్మీకి మౌత్ ఆర్గన్ వాయించడం నేర్పించింది దాని మావటి వాడే. ఈ క్రెడిట్ అంతా అతనికే దక్కుతుంది.

మౌత్ ఆర్గన్ వాయించడం నేర్పించేందుకు చాలా కష్టపడ్డాను

మౌత్ ఆర్గన్ వాయించడం నేర్పించేందకు చాలా కష్టపడ్డట్లు తెలిపాడు మావటివాడు. మౌత్ ఆర్గన్ వాయించడం నేర్చుకునే సమయంలో దాదాపు 5 పరికరాలను లక్ష్మీ విరగొట్టిందని చెప్పుకొచ్చాడు. కానీ ఎలాగైనా నేర్పించి లక్ష్మీకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న తపనతో మౌత్ ఆర్గన్ వాయించడం నేర్పించినట్లు వెల్లడించాడు. ఇదొక సవాలుగాతీసుకుని విజయం సాధించానని చెప్పాడు. ముందుగా తను ఏమి మాట్లాడుతున్నానో అర్థం చేసుకునే ప్రయత్నం చేసిందన్నాడు మావటివాడు. అలా చిన్నగా నేర్చుకున్న లక్ష్మీ ఆలయంలో ఎక్కడా ఆపకుండా మౌత్ ఆర్గన్‌ను 15 నిమిషాలు పాటు వాయించగలదని చెప్పాడు.


ఇదిలా ఉంటే సంరక్షణ కేంద్రంలో చాలా ఏనుగులు వస్తాయి. దాదాపు 48 రోజుల పాటు ఇక్కడే ఉంటాయి. ఆ సమయంలో వీటి ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి సారిస్తారు అధికారులు. ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్‌లు నిర్వహిస్తారు. అదే సమయంలో మంచి ఆహారం కూడా వీటికి అందిస్తారు. శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని పలు టెస్టులు కూడా చేస్తారు. ఈ తరహా పద్ధతి 2003లో నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ప్రారంభించారు.

English summary
A mahout in Tamil Nadu's Thekkampatti has trained his elephant to play the mouth organ. A video on Twitter shows the elephant Lakshmi, holding the instrument with her trunk and swaying as she plays it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X