Vijay Karur case:'జననాయగన్'-కరూర్ తొక్కిసలాటకు లింకు,అక్కడే అడ్డంగా దొరికేసిన విజయ్..!?

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు 'దళపతి'విజయ్ చుట్టూ ఒక సంచలన కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది.గత ఏడాది కరూర్ జిల్లాలో జరిగిన దుర్ఘటన వెనుక సినిమా షూటింగ్ ఉందనే ఆరోపణలు,కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ (CBI)రంగ ప్రవేశం చేయడం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ పెను భూకంపం సృష్టిస్తోంది.

నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (TVK) పార్టీకి,కేంద్రంలోని బీజేపీకి మధ్య పొత్తు కుదురుతుందని కొద్దిరోజులుగా ప్రచారం సాగింది.అయితే,ఎవరితోనూ పొత్తు పెట్టుకోను అని విజయ్ తెగేసి చెప్పిన కొద్ది గంటల్లోనే,కరూర్ జిల్లాలో జరిగిన పాత కేసు మళ్ళీ తెరపైకి రావడం రాజకీయంగా పెను సంచలనంగా మారింది.

vijay-karur-stampede-case-cbi-probe-drone-video-twist-sparks-political-storm-in-tamil-nadu

అసలేం జరిగింది?డ్రోన్ వీడియోల మిస్టరీ

గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్ జిల్లాలో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పుడు సిబిఐ విచారణ ముమ్మరం చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నిన్న లీక్ అయిన కొన్ని డ్రోన్ వీడియోలు విజయ్ ను ఇరకాటంలో పడేశాయి.విజయ్ తన ప్రచార వాహనాన్ని అనుమతించిన ప్రాంతం కంటే ఒక 20 మీటర్లు ముందుకు తీసుకెళ్లడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని సిబిఐ ప్రాథమికంగా గుర్తించింది.ఎందుకు అలా చేశారన్న దానికి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.జనం సముద్రంలా కనిపిస్తున్న సినిమాటిక్ షాట్ కోసం కావాలనే వాహనాన్ని ఇరుకైన సందులోకి పోనిచ్చారని ఆరోపణలు వస్తున్నాయి.

నక్కీరన్ గోపాల్ షాకింగ్ ఆరోపణలు

ప్రముఖ జర్నలిస్ట్ నక్కీరన్ గోపాల్ ఈ ఉదంతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ నటిస్తున్న 'జననాయగన్' సినిమా షూటింగ్ కోసమే కరూర్ సభను వాడుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల సేవ కోసం వచ్చానని చెప్పే విజయ్.. తన సినిమా షాట్స్ కోసం అమాయక ప్రజలను బలిపశువులను చేశారని గోపాల్ మండిపడ్డారు.అక్కడ జనం చనిపోతున్నాపట్టించుకోకుండా షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయారని విమర్శించిన ఆయన...జనం తన కోసం వస్తున్నారని,వారిని కాపాడాలని విజయ్ అనుకోలేదున్నారు.ఆ మనస్తత్వం చాలా భయంకరమైనదని వర్ణించారు.

అమిత్ షా చేతిలో సిబిఐ రిమోట్?

బీజేపీతో పొత్తుకు విజయ్ నిరాకరించిన వెంటనే సిబిఐ స్పీడ్ పెంచడంపై రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. విజయ్ తొలగించాలనుకున్న డ్రోన్ వీడియోలను సిబిఐ రికవరీ చేసినట్లు తెలుస్తోంది. సదరు ప్రచార వాహనాల్లో సినిమాలకు వాడే Arri Alexa 35 వంటి హై-ఎండ్ కెమెరాలను వాడారా? అనే కోణంలో ఫోరెన్సిక్ విచారణ జరుగుతోంది. ఒకవేళ షూటింగ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు నిరూపితమైతే విజయ్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

సినిమా వేరు.. రాజకీయం వేరు అని చెప్పే విజయ్,తన రాజకీయ సభలను సినిమా షూటింగ్ కోసం వాడుకున్నారనే వార్త ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశమైంది.41 మంది ప్రాణాలకు బాధ్యత వహిస్తూ విజయ్ చుట్టూ సిబిఐ ఉచ్చు బిగిస్తోందా?లేక బీజేపీ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలకు విజయ్ బలి అవుతున్నారా?అన్నది వేచి చూడాలి.ప్రస్తుతం మాత్రం ఢిల్లీ పెద్దల రియల్ గేమ్ విజయ్‌కు వ్యతిరేకంగా మొదలైనట్టే కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+