విదేశీ వ్యవహరాల కార్యదర్శిగా విజయ్ కేశవ్ గోఖలే నియామకం
న్యూఢిల్లీ: విజయ్ కేశవ్ గోఖలేను విదేశీ వ్యవహరాల కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రెండేళ్ళ పాటు విజయ్ కేశవ్ గోఖలే ఈ పదవిలో కొనసాగుతారు.ఎస్. జయశంకర్ జనవరి 28న, రిటైర్ కానున్నారు.దీంతో ఆయన స్థానంలో విజయ్ కేశవ్ గోఖలేను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.
విజయ్ కేశవ్ గోఖలే 1981 ఐఎప్ఎస్ బ్యాచ్ అధికారి. చైనాలో భారత దేశ ప్రతినిధిగా కూడ ఆయన పనిచేశారు.విజయ్ కేశవ్ గోఖలేకు ఈ పదవిలో నియమిస్తూ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గోఖలే విదేశీ వ్యవహరాల శాఖలో ఆర్థిక వ్యవహరాల కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

జయశంకర్ 2015 జనవరి 29వ, తేదిన విదేశీ వ్యవహరాల కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టారు. రెండేళ్ళ పాటు ఆయన పదవి కాలం. అయితే గత ఏడాది జనవరి మాసంలో ఆయనకు ప్రభుత్వం మరో ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగించింది.












Click it and Unblock the Notifications