నేరగాడినా, భారత్‌కు రాను: మాల్యా సీక్రెట్‌గా ఇక్కడే ఉన్నాడు!
లండన్: తనపై ఇప్పటికే ఓ నేరగాడన్న ముద్ర భారత్‌లో పడిందని, అందువల్ల తాను తిరిగి భారత్‌కు వెళ్లేందుకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నానని విజయ్ మాల్యా ఖరాఖండిగా చెప్పాడు. మాల్యా సండే గార్డియన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
తనపై గత సంవత్సరం లుకౌట్ నోటీసు జారీ అయిందని, తాను ఏమీ పారిపోలేదన్నాడు. ఇప్పుడు తనను క్రిమినల్‌గా ఎందుకు చిత్రీకరిస్తున్నారని ప్రశ్నించాడు. రుణాలు తీర్చలేకపోవడం వ్యాపారంలో భాగమని, బ్యాంకులు రుణాలు ఇచ్చినప్పుడే, వాటికి రిస్క్ గురించి కూడా తెలుసునని చెప్పాడు.
తన సొంత వ్యాపారం నాశనమైందని, తనను చెడ్డవాడిగా చూడవద్దన్నాడు. మొత్తం విషయంలో పెద్ద బాధితుడిని తానేనని, తనకు భారత్ వెళ్లాలని ఉన్నా, తన వాదన వినిపించేందుకు పారదర్శకమైన అవకాశం లభించదని భావిస్తున్నానని చెప్పాడు.

తాను ఎక్కడ ఉన్నానన్న విషయాన్ని స్పష్టం చేయలేనని చెప్పాడు. యూకేలోనూ తనను మీడియా వెంటాడుతోందని, తాను మీడియాతో మాట్లాడబోనని చెప్పాడు. అతను ఈ మెయిల్ ఇంటర్వ్యూ ద్వారా స్పందించాడు.
కాగా, విజయ్ మాల్యా బ్రిటన్‌లో ఓ ఎస్టేట్‌లో ఉంటున్నాడు. హెర్త్ పోర్ షైర్‌లో సెయింట్ ఆల్బాన్స్ సమీపంలోని టివెన్ గ్రామంలో ఉన్న తన నివాసంలో మాల్యా ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మాల్యా తలదాచుకున్న నివాసం ఫోటో కూడా మీడియాలో వస్తోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications