విజయ్ రూపానీకే పట్టం: గుజరాత్ సీఎంగా రెండో సారి బాధ్యతలు

Posted By:
Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్‌రూపానీ కొనసాగనున్నారు. శుక్రవారం నాడు బిజెపి నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది

  గుజరాత్ సిఎం రేసులో ఉన్న పలువురు వీరే !

  గుజరాత్ రాష్ట్ర బిజెపి శాసనసభపక్ష సమావేశం శుక్రవారం నాడు జరిగింది.ఈ సమావేశంలో విజయ్ రూపానీని కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. గుజరాత్ డిప్యూటీ సీఎంగా నితిన్ పటేల్‌ను కొనసాగించాలని నిర్ణయించారు.

  Vijay Rupani to Continue as Gujarat CM, Nitin Patel Remains Deputy

  గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిజెపి ఆరో దఫా విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో బిజెపిత 99 సీట్లను కైవసం చేసుకొంది. అయితే ఈ ఏడాది మే మాసంలోనే విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పార్టీ నిర్ణయించింది.

  గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రిని మార్చుతారనే ప్రచారం కూడ సాగింది. కానీ, పదే పదే సీఎంలను మార్చడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లే ఉందనే కారణాన్ని కూడ పరిగణనలోకి తీసుకొన్నారు. ఈ తరుణంలోనే విజయ్ రూపానీకి మరోసారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Vijay Rupani has been retained as Gujarat Chief Minister.Nitin Patel will continue as the Deputy Chief Minister.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి