షాకైన విజయసాయిరెడ్డి.. ! ఈసీ, కేంద్రానికి అంతే షాకింగ్ డిమాండ్..!
ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా చక్రం తిప్పిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. గత ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఏకంగా వైసీపీ ఎంపీ పదవితో పాటు రాజకీయాలకు సైతం గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించేశారు. అయితే అడపాదడపా ఏపీ మద్యం కుంభకోణం విషయంలో వ్యాఖ్యలు చేస్తూ, విచారణకు సాక్షిగా హాజరవుతున్న సాయిరెడ్డి.. ఇప్పుడు ఓ కీలక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీహార్ లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు అటు అధికార ఎన్డీయేతో పాటు విపక్ష ఇండియా కూటమికీ ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈసీ సాయంతో బీహార్ లో ఎన్నికల వేళ హడావిడిగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎన్డీయేకు ఓటు వేసే అవకాశం లేదని భావిస్తున్న నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ జాతీయులు ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు ఈ ఆంశంపైనే విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

బీహార్ లో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో నేపాలీలు, బంగ్లాదేశీయులు , మయన్మార్ జాతీయులు ఆధార్, రేషన్ కార్డులు , నివాస ధృవీకరణ పత్రాలతో కనిపించడం దిగ్భ్రాంతికరమని సాయిరెడ్డి తెలిపారు. విదేశీయులు మన ఎన్నికలలో ఎందుకు ఓటు వేయాలి అని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఇక్కడి మన వనరులను ఎందుకు పొందాలని అడిగారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించాలని, ఈ అక్రమ వలసదారులను బహిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్నిసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
Shocking that Nepalese, Bangladeshis & Myanmarese nationals were found with Aadhaar, ration cards & domicile certificates during Spl. Intensive Revision in Bihar. Why should foreigners vote in our elections or get access to our resources? Urging @ECISVEEP to conduct a nationwide…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 14, 2025












Click it and Unblock the Notifications