ప్రశాంత్ కిషోర్ పై సాయిరెడ్డి పొగడ్తలు..! వైసీపీ ట్రోలింగ్ వేళ..!
మాజీ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేతప్రశాంత్ కిషోర్ కూ, వైసీపీకి గతంలో అనుబంధం ఉండేది. 2019 ఎన్నికల్లో తన రాజకీయ వ్యూహాలతో వైసీపీకి భారీ విజయం అందించిన ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల్లో వ్యూహకర్తల అవసరాన్ని తొలిసారి తెలియజెప్పారు. దీంతో ఆ ఎన్నికల్లో బీహార్ డెకాయిట్ అంటూ పీకేను విమర్శించిన చంద్రబాబు వంటి వారు సైతం ఆ తర్వాత రూటు మార్చి రాబిన్ శర్మ వంటి పీకే శిష్యుల్ని వ్యూహకర్తలుగా నియమించుకుని గత ఎన్నికల్లో గెలుపు అందుకున్నారు.
అయితే దేశంలో వైసీపీతో పాటు చాలా పార్టీలకు ఎన్నికల విజయాల్ని అందించిన ప్రశాంత్ కిషోర్ తానే నేరుగా పోటీ చేసి ఎందుకు గెలవకూడదని భావించి బీహార్ లో రెండేళ్ల క్రితమే జన్ సురాజ్ పార్టీని స్థాపించారు. అయితే తాజా ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా పార్టీ తరఫున అభ్యర్ధుల్ని నిలబెట్టిన పీకేను జనం నమ్మలేదు. దీంతో పోటీ చేసిన 98 శాతం సీట్లలో డిపాజిట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో తాను గెలిపించిన వైసీపీయే విమర్శలు గుప్పిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓటమి తప్పదని ఊహించి చెప్పినప్పటి నుంచీ పీకేపై వైసీపీ శ్రేణుల్లో కోపం ఉంది.

ఇప్పుడు బీహార్ లో ఆయన పార్టీ ఓటమిపాలవ్వడంతో పీకేపై వైసీపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసింది. తన వల్లే వైసీపీ గెలిచిందని చెప్పుకున్న పీకే.. ఈసారి తన పార్టీకి డిపాజిట్లు ఎందుకు తెచ్చుకోలేకపోయాడన్న ప్రశ్నల్ని వైసీపీ సంధిస్తోంది. ఇలాంటి సమయంలో వైసీపీ మాజీ ఎంపీ, ఇప్పటికే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి స్పందించారు. ఎక్స్ లో ప్రశాంత్ కిషోర్ ను పొగుడుతూ ఆయన ఓ ట్వీట్ పెట్టారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై ట్వీట్ పెడుతూ అందులో పీకేను సాయిరెడ్డి ప్రశంసించారు.

1/2: Congratulations to the NDA, led by BJP, JDU and LJP on a decisive victory in the Bihar Assembly elections. Overcoming nearly 2 decades of anti-incumbency is no small feat, and this mandate reflects the people’s trust in your leadership. Bihar needs a strong and stable…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 15, 2025
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు సాయిరెడ్డి అభినందనలు తెలిపారు. దాదాపు 2 దశాబ్దాలుగా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం చిన్న విషయం కాదన్నారు. ఈ తీర్పు మీ నాయకత్వంపై ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. బీహార్ అభివృద్ధి వైపు తన ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి బలమైన, స్థిరమైన ప్రభుత్వం అవసరమన్నారు. బీహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ బృందం కలిసి పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే విశ్వసనీయమైన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన ప్రశాంత్ కిషోర్ కు ప్రశంసలు తెలుపుతున్నట్లు సాయిరెడ్డి తెలిపారు. జీరో నుంచి ఏదైనా ప్రారంభించడం, ఏర్పాటు చేయడం అంత సులభం కాదన్నారు. ముఖ్యంగా జన్ సురాజ్ పార్టీ లేవనెత్తిన వలస, సీడీ నిష్పత్తి వంటి అంశాలు బీహార్‌కు చాలా సందర్భోచితంగా ఉంటాయన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications