ఇస్రో ఛైర్మెన్ గా కె. శివన్ నియామకం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇస్రో కొత్త చైర్మన్‌గా కే శివన్ నియమితులయ్యారు. శివన్ ప్రస్తుతం విక్రమ్ సారాబాయి అంతరిక్ష సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు. మూడేండ్ల పాటు ఆయన ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు.

ఇస్రో చైర్మెన్ పదవితో పాటు స్పేస్ డిపార్ట్‌మెంట్‌కు సెక్రటరీగా కూడ శివన్ వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా ఏఎస్ కిరణ్ కుమార్ ఉన్నారు.. మరో రెండు రోజుల్లో శ్రీహరికోట నుంచి ఇస్రో 100వ శాటిలైట్‌ను లాంచ్ చేయనున్న తరుణంలో ఇస్రో చైర్మన్‌గా శివన్‌ను నియమించటం ప్రాధాన్యం సంతరించుకున్నది.

 Vikram Sarabhai Space Centre director will now head ISRO

1982లో కే శివన్ ఇస్రోలో జాయిన్ అయ్యారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్‌ఎల్‌వీ) ప్రాజెక్ట్‌తో తన ప్రస్థానాన్ని శివన్ ప్రారంభించారు. మద్రాస్ ఐఐటీ నుంచి 1980లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేసిన శివన్, 1982 లో ఐఐఎస్‌సీ బెంగళూరు నుంచి మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

తర్వాత 2006లో బాంబే ఐఐటీ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్ట్ మిషన్ ప్లానింగ్, మిషన్ డిజైన్, మిషన్ ఇంటిగ్రేషన్ అండ్ అనాలిసిస్‌లో శివన్ ముఖ్య పాత్ర పోషించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Noted scientist Sivan K was today appointed as the chairman of Indian Space Research Organisation (ISRO) to replace A S Kiran Kumar.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X