బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటకలో దారుణం.. కరోనా పేషెంట్లను తరలిస్తున్న అంబులెన్సుపై దాడి...

|
Google Oneindia TeluguNews

కర్ణాటకలో దారుణం జరిగింది. కోవిడ్-19 పేషెంట్లను తరలిస్తున్న ఓ అంబులెన్సుపై ఓ గ్రామస్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. గతంలో కరోనా టెస్టుల కోసం వెళ్లిన వైద్యులు,ఆశా వర్కర్స్‌పై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కొంతమంది వైద్యులపై కూడా అక్కడక్కడా దాడులు జరిగాయి.

 కర్ణాటక ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈనెల 17 నుంచి ఆంధ్రాకు బస్సులు.. ఆన్ లైన్ రిజర్వేషన్ షురూ.. కర్ణాటక ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈనెల 17 నుంచి ఆంధ్రాకు బస్సులు.. ఆన్ లైన్ రిజర్వేషన్ షురూ..

తాజా ఘటనకు సంబంధించి కర్ణాటకలోని కలబుర్గి ఎస్పీ మార్టిన్ మార్బనియంగ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 'కమలాపూర్ తాలుకాలోని మర్మంచి తండాలో 15 మందికి కరోనా సోకింది. సోమవారం మధ్యాహ్నం వచ్చిన రిపోర్టుల్లో ఈ విషయం బయటపడింది. దీంతో ఆ గ్రామానికి వచ్చిన మెడికల్ టీమ్‌.. కోవిడ్ 19 పేషెంట్లను అంబులెన్సులో ఎక్కించింది.' అని తెలిపారు.

Villagers pelt stones at ambulance escorting coronavirus patients to hospital

అనంతరం అంబులెన్సులో వారిని తరలిస్తుండగా మార్గమధ్యలో గ్రామస్తులు అడ్డుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్తతలకు దారితీసిందన్నారు. దీంతో రెచ్చిపోయిన గ్రామస్తులు అంబులెన్సుతో పాటు హెల్త్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన మరో వెహికల్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డట్టు తెలిపారు. నిందితులపై కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని.. దీనిపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

Recommended Video

Kara Hunnime Fair : నాతొక్కలో CORONA అంటూ ఎడ్ల బండి పోటీలు.... జాతరలో వేల మంది! || Oneindia Telugu

సోమవారం(జూన్ 16) కర్ణాటకలో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7213కి చేరింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 88 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

English summary
Villagers of a Karnataka village pelted stones at an ambulance and a vehicle of health department which was in the area to escort 15 people, who had tested positive for coronavirus, to the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X