మీ అబద్దపు హామీలతో విసిగిపోయాం- బైడెన్ ..మోదీ సమక్షంలోనే : గ్లాస్గోలో భారతీయ విద్యార్ధిని- స్టాండింగ్ ఒవేషన్..

ప్రపంచాధినేత ముందు భారతీయ విద్యార్ధిని చేసిన ప్రసంగం పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. ఏకంగా ప్రపంచాధినేతలను ఉద్దేశించి ఆ యువతి ఎటువంటి భయం...బెరుకు లేకుండా తాను చెప్పదలచుకున్నది చెప్పేసింది. గ్లాస్గోలో జరిగిన కాప్ 26 సదస్సులో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆ విద్యార్ధిని తన ప్రసంగంలో... మీ అబద్దపు హామీలు వినీ వినీ విసిగిపోయాం... మాకు ఆ వాగ్దానాలు ఇక అసవరం లేదు.. మాకు వాటితో కోసం కూడా వస్తోంది..మీరు చెప్పింది చాలు...ఏం చెబుతున్నారో అది చేసి చేతల్లో చూపండి అంటూ ఒక రేంజ్ లో మాట్లాడటంతో అక్కడ ఉన్న అనేక దేశాల అగ్రనేతలు సైతం ఒక్క నిమిషం ఆ విద్యార్ధిని చెబుతున్నది విని విస్తుపోయారు.

ఉత్తుత్తి హామీలు కట్టిబెట్టండి అంటూ..


తమిళనాడు లోని తిరువణ్ణాలమలైకి చెందిన ఆ విద్యార్దిని పేరు వినీశా ఉమా శంకర్. వయసు 15 ఏళ్లు. ఈ విద్యార్దిని సౌర శక్తితో పని చేసే సంచార ఇస్త్రీ బండిని ఆవిష్కరించారు. బ్రిటన్ యువరాజు విలియమ్స్ ఆహ్వానం మేరకు స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరుగుతున్న కాప్ 26 సదస్సులో పాల్గొన్న వినీశా క్లీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ అనే అంశంపై ప్రపంచాన్ని ఆకట్టుకునేలా ఉపన్యసించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వంటి నేతలున్న ఆ వేదికపై పర్యావరణాన్ని రక్షించుకునేందుకు తక్షణం నడుంబిగించాలని సూచించింది. ఉత్తుత్తి హామీలు కట్టిపెట్టాలని కోరింది.

భారత బిడ్డను మాత్రమే కాదు..ఈ భూమి బిడ్డను

భారత బిడ్డను మాత్రమే కాదు..ఈ భూమి బిడ్డను

తాను కేవలం భారత బిడ్డను మాత్రమే కాదని, ఈ భూమి బిడ్డనని చెప్పుకొచ్చింది. అందుకు తాను గర్విస్తున్నానని పేర్కొంది. భావి తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించే చర్యలు చేపట్టడంలో విఫలమైతే తానే స్వయంగా ఆ పనికి పూనుకుంటానని చెప్పారు. మీరు కాకపోతే..మా భవిష్యత్ ను మేమే నిర్మించుకోవాలి కదా..మాతో కలిసి రండి..భూగోళాన్ని కాపాడండి అంటూ పిలుపునిచ్చారు. ఉత్తుత్తి హామీలు వినీవినీ తమ తరం విసుగెత్తిపోయిందని, పర్యావరణాన్ని రక్షించి భూమిని కాపాడాలని కోరింది. పాత చర్చలపై అనవసర ఆలోచనలు విడిచిపెట్టాలని సూచించింది.

అధినేతల స్టాండింగ్ స్టాండింగ్ ఒవేషన్

అధినేతల స్టాండింగ్ స్టాండింగ్ ఒవేషన్


సమయాన్ని, డబ్బును, ప్రయత్నాలను అనవసరంగా ఖర్చు చేయడం మాని తమలాంటి 'ఎర్త్ షాట్ ప్రైజ్' విన్నర్లు, ఫైనలిస్టుల ఆవిష్కరణలపై ఇన్వెస్ట్ చేయాలని అంతేకానీ, శిలాజ ఇంధనాలు, పొగ, కాలుష్యం వంటి వాటి వల్ల నిర్మితమవుతున్న ఆర్థిక వ్యవస్థపై కాదంటూ స్పష్టంగా చెప్పింది. వినీశా ప్రసంగానికి ప్రపంచ నేతలు ముగ్దులయ్యారు. ప్రసంగం ముగిశాక కరతాల ధ్వనులతో, స్టాండింగ్ ఒవేషన్‌తో ఆమెకు అభినందనలు తెలిపారు. ఆ తరువాత ప్రధానితో వినీశా ప్రత్యేకంగా సమావేశం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+