‘ఓ కాకా కారు ఇక్కడ ఆపొద్దు’: స్పీకర్‌తో ఇలా, ఉద్యోగం ఊడింది!

Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: అసెంబ్లీ స్పీకర్‌ను పట్టుకుని అంత మాటంటావా? అంటూ ఓ సెక్యూరిటీ గార్డును తొలగించారు ఉన్నతాధికారులు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్, బీజేపీ సీనియర్ నేత రాంలాల్ ఓరా జూన్ 13న తన కుమారుడితో కలిసి గాంధీనగర్ సివిల్ హాస్పిటల్‌కి కంటి చికిత్స నిమిత్తం వెళ్లారు.

వోరా కారు హాస్పిటల్ ఎదురుగా ఆపడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు.. 'ఓ కాకా కారు ఇక్కడ ఆపకూడదు. పక్కకు వెళ్లి ఆపు' అని అన్నాడు. అయితే, ఓ సెక్యూరిటీ గార్డు తనని మర్యాద లేకుండా కాకా అనడం వోరాకి నచ్చలేదు. దీంతో ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి ఆ సెక్యూరిటీ గార్డును విధుల్లో నుంచి తొలగించివేశారు.

VIP alert: Security guard calls Gujarat Speaker 'kaka', agency loses contract

అంతేగాక, అతని నుంచి క్షమాపణ లేఖ కూడా రాయించుకున్నారు. 'వోరా ఓ పెద్ద మనిషి. అసెంబ్లీ స్పీకర్. అంత పెద్దాయనతో మర్యాదపూర్వకంగా ఉండాలి. ఏదో పక్కింటి వ్యక్తిని పిలిచినట్లు కాకా అనడం భావ్యం కాదు. అందుకే అతడ్ని విధుల నుంచి తొలగించాం' అని ఆస్పత్రి సూపరింటెండెంట్ బిపిన్ నాయక్ తెలిపారు.

ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. కాగా, ఓ పక్క ప్రధాని మోడీ వీఐపీ కల్చర్‌ను రద్దు చేయాలని చూస్తుంటే.. మరో పక్క అదే పార్టీకి చెందిన నేతలు ఇలాంటి చిన్న విషయాలపై ఈ విధంగా ప్రవర్తించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఉద్యోగిపై తమ ప్రతాపం చూపిస్తారా? అని మండిపడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At a time when Prime Minister Narendra Modi is discouraging the VIP culture, and promoting the idea of 'every person is important' rather than having a few 'Very Important Person(s)', here's what is happening in his homestate Gujarat.
Please Wait while comments are loading...