
viral video:ఏందిరా ఇదీ.. వరుడి దండ నుంచి మనీ తీసిన దోస్త్.. వైరల్
ఇంపార్టెంట్ పనిలో ఉంటే అన్నీ మరచిపోతాం.. అంటే మన పర్సు, దండలో ఏం జరుగుతుందో చూసుకోం.. ఎందుకంటే మన వద్దకు దగ్గరి వాళ్లే వస్తారు.. కానీ ఇతరులు కాదు కదా.. అనే ధీమా ఉంటుంది. అదే కొన్నిసార్లు దెబ్బతీస్తోంది. అలాంటి ఘటనే జరిగింది. ఇదీ ఎప్పుడు.. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అవును ఆ వీడియో వైరల్‌గా మారింది. వరుడు బిజీగా ఉంటే.. హితుడు తన చేతివాటం ప్రదర్శించారు. ఆ వీడియో చూసి నెటిజన్లు ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు.
కరెన్సీ నోట్ల దండ నుంచి
పెళ్లి కొడుకును వీడియోలో చూడొచ్చు. అతను అటు ఇటు చూస్తూ బిజీగా ఉన్నాడు. అతని మెడలో కరెన్సీ నోట్లతో దండ ఉంది. దానిపై ఒకడి కన్ను పడింది. అందినకాడికి తీసుకుందాం అనుకున్నాడు. ఇంకేముంది.. మెల్లగా ట్రై చేశాడు. అయితే అతను తీసే సమయంలో.. అతను వైపు వరుడు వంగాడు. దీంతో కాసేపు తన దొంగతనానికి స్టాప్ చెప్పాడు. మళ్లీ అటు చూసే సమయంలోనే నగదు తీసుకున్నాడు. వెంటనే మడిచి జేబులో కుక్కాడు. ఆ వీడియోను ఎవరో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది.

పక్కా బిజినెస్ మేన్
దీనిపై ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నాయి. ఇండియన్ మనీ హైస్ట్ అని ఒకరు.. ద బిజినెస్ మేన్ అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. అంతేమరీ అతను తన పనిలో ఉంటే.. నగదు తీయడం దారుణం.. దట్ టు.. అదీ దండలోంచి తీయడం కరెక్ట్ కాదు.. ఏదో బంధువో/ ఫ్రెండ్ అని మాట్లాడితే.. దగ్గరకు రానిస్తే.. అతను ఇలా చేయడం ఏంటీ అని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇదీ మంచి పద్దతి కాదని ఏకీ పారేస్తున్నారు. మరికొందరు నమ్మకద్రోహి అంటూ కామెంట్ చేస్తున్నారు. వీడియో మాత్రం ట్రోల్ అవుతుంది.. నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఆ వీడియోను లక్షసార్లు చూశారు.

పెళ్లి కూతురు ఇలా..
కొన్నివారాల క్రితం ఓ పెళ్లి కూతురు మోమో తింటూ కనిపించింది. తన పెళ్లి రోజు ఆభరణాలు, డ్రెస్ వేసుకొని కనిపించానని పేర్కొంది. ఆమె ఆ వీడియోను షేర్ చేసింది. అంతేకాదు ఉత్సాహం ఆపుకోలేక డ్యాన్స్ కూడా చేసింది. జనవరిలో ఆ వీడియో అప్ లోడ్ చేయగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.