బసవరాజు బొమ్మై భావొద్వేగం.. శునకం చనిపోతే అలా.. అప్పటి వీడియో నేడు వైరల్ (Video)
బసవరాజు బొమ్మై.. కర్ణాటక సీఎం. లింగాయత్ కమ్యూనిటీకి చెందిన నేత. అంతకుముందు హోం మంత్రిగా పనిచేశారు. యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు.. ఇదీ బొమ్మై గురించి కొంత.. ఇన్ఫో.. కానీ ఆయనలో మరో కోణం కూడా ఉంది. మూగ జీవాలు అంటే ప్రాణం. ముఖ్యంగా తన శునకం అంటే పంచ ప్రాణాలు. ఈ విషయం అదీ చనిపోయిన సందర్భంలో అందరికీ తెలిసింది. దానికి అంత్యక్రియలు కూడా చేశారు. అలా జరిగిన దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది.

సీఎం కొడుకుగా..
బొమ్మై.. తండ్రి కూడా ఎస్ఆర్ బొమ్మై కూడా సీఎంగా పనిచేశారు. బసవరాజు బొమ్మై హోం మంత్రి నుంచి చీఫ్ మినిస్టర్‌గా ప్రమోట్ అయ్యారు. హోం మంత్రిగా ఉన్న సమయంలో.. అతను ప్రాణంగా పెంచుకున్న శునకం చనిపోయింది. ఆ బాధను బొమ్మై.. ఫ్యామిలీ కూడా భరించింది. బొమ్మై అయితే కంటతడి పెట్టారు. శునకానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. తమ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయారని ఫీలయ్యారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ ట్రోల్ అయ్యింది. నెట్టింట్లో వైరల్ కావడంతో.. ఒక్కొక్కరు ఒక్కొలా కామెంట్ చేశారు. ఇదీ జరిగిన ఘటన.
శునకం చనిపోతే..
కానీ ఇప్పుడు ఆ వీడియో మరోసారి ట్రోల్ అవుతుంది. బసవరాజు బొమ్మైలోని సున్నితత్వం బయటపడింది. మూగజీవాలపై ఆయన చూపిన ప్రేమ బయటపడింది. సీఎం కావడంతో ఆ వీడియో మళ్లీ వెలుగులోకి వచ్చింది. బొమ్మై మనసు ఇలా ఉంటుంది అని ప్రతీ ఒక్కరూ అంటున్నారు. నెటిజన్లు కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు. శభాష్ సీఎం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదైనా మంచి చేస్తే బయటపడుతుంది. ప్రేమ చూపించిన వారి గుణ గణాలను బహిర్గతం చేస్తోంది. ఇప్పుడు అదే జరిగింది. బసవరాజులోని మరో కోణం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

సున్నిత మనస్తత్వం..
రాజకీయ నేత అంటే కటువుగా ఉండాలి.. ఉంటారు. పాలిటిక్స్ ఏమో కానీ.. మూగ జీవాలపై వాత్సల్యం చూపడం మాత్రం అరుదు. అలాంటి వారి జాబితాలో బసవరాజు చేరారు. అవును తనలోని మంచితనాన్ని బసవరాజు ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని కూడా చక్కగా పాలిస్తానని ఇండెర్టుగా ఇండికేషన్ ఇచ్చారు. దానిని నెటిజన్లు కూడా అంగీకరించాల్సిన పరిస్థితి. మొత్తానికి శభాష్ బొమ్మై అని మాత్రం అంటున్నారు.

ఇంజినీర్ టు పొలిటిషీయన్
జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు బసవరాజు బొమ్మై. 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో.. 2008లో బీజేపీలో చేరారు. తర్వాత క్రమంగా కీలక నాయకుడిగా ఎదిగారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా పనిచేశారు. సీఎం రేసులో అరవింద్ బెల్లాద్, బసన్నగౌడ పాటిల్, సీటీ రవి తదితర పేర్లు వినిపించాయి. కానీ చివరకు బసవరాజు బొమ్మై వైపు హై కమాండ్ దూతలు మొగ్గుచూపారు. బొమ్మైని సీఎంగా ఎన్నుకున్నారు. గతంలో టాటా గ్రూప్‌లో బసవరాజు బొమ్మై ఇంజనీర్‌గా పని చేసి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.












Click it and Unblock the Notifications