ఐ లవ్ యూ అంటూ క్లాస్ రూంలోనే టీచర్‌కు విద్యార్థుల వేధింపులు (వీడియో)
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ పాఠశాలలో విద్యార్థులు కీచకులుగా మారారు. ఏకంగా మహిళా ఉపాధ్యాయురాలిని తరగతిలోనే వేధించారు. దీంతో ఆ ముగ్గురు పాఠశాల విద్యార్థులపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదైంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా సైట్‌లలో వైరల్‌గా మారింది. అందులో విద్యార్థిని ఒకరు మహిళా టీచర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వినవచ్చు.

28 సెకన్ల వీడియోలో, ఈ ముగ్గురు టీచర్ క్లాస్‌లో బోధిస్తున్నప్పుడు ఆమెకు 'ఐ లవ్ యూ' అని చెప్పడంతోపాటు ఆమెని వేధించడం చూడవచ్చు.
నిందిత విద్యార్థులు అతాష్, కైఫ్, అమన్‌పై పోలీసు స్టేషన్‌లో వేధింపులకు సంబంధించిన సంబంధిత సెక్షన్ల కింద అధికారికంగా ఫిర్యాదు చేశారు.
Breaking News: In UP's Meerut, inside the school, 3 student Atash, Kaif, Aman molested & said "I Love U" to the female teacher & made its video viral on social media. Shagufa a female accused also involved
— Ashwini Shrivastava (@AshwiniSahaya) November 27, 2022
FIR filled under sec for obscene comments, threat to murder & IT act
+ pic.twitter.com/jb0pEcajAE
నివేదికల ప్రకారం, ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేసి, ఐటీ చట్టంలోని సెక్షన్లు, లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. ఉపాధ్యాయుడిని వేధించడంలో నిందితుడి సోదరిని కూడా పోలీసులు విచారిస్తున్నారని అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications