వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విరాట్ కోహ్లీ: ఈ ‘యంత్రం’ పరుగు మళ్లీ మొదలైందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ ఈ ఏడాది రెండోసారి సెంచరీ కొట్టాడు.

శ్రీలంక మీద 3వ వన్డేలో సెంచరీ చేయడం ద్వారా వన్డేలలో 46 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. దీంతో మొత్తం మీద అన్ని ఫార్మెట్లలో కలిపి కోహ్లీ సెంచరీల సంఖ్య 74కు చేరుకుంది.

మూడో వన్డేలో 85 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 10 ఫోర్లు ఒక సిక్సు కొట్టాడు. ఇందులో ఒక హెలికాప్టర్ షాట్ కూడా ఉండటం విశేషం. సాధారణంగా హెలికాప్టర్ షాట్ అనేది ధోనీ ట్రేడ్ మార్క్.

కోహ్లీ గత నాలుగు ఇన్నింగ్సుల్లో మూడు సెంచరీలు చేయడం గమనార్హం.

విరాట్ కోహ్లీ 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు కాసేపు మ్యాచ్ ఆగిపోయింది.

43వ ఓవర్‌లో కోహ్లీ కొట్టిన ఫోర్‌ను ఆపేందుకు ప్రయత్నించిన బండార, జెఫ్రీ... బౌండరీ లైన్ వద్ద ఒకరినొకరు ఢీ కొట్టారు.

గ్రౌండ్‌లోకి వచ్చిన ఫిజియోథెరపిస్టులు స్ట్రెచర్లు తెప్పించి వారిని తీసుకెళ్లారు.

ఆ తరువాత మ్యాచ్ మళ్లీ మొదలైన తరువాత కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు.

https://twitter.com/ICC/status/1614582356018348032

ప్రపంచంలోనే ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డ్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉంది. వన్డేలు, టెస్టులలో సచిన్ 100 సెంచరీలు చేశాడు. 51 టెస్టు సెంచరీలు, 49 వన్డే సెంచరీలున్నాయి.

ఇప్పుడు వన్డేలలో 46 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ మరొక నాలుగు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డును బ్రేక్ చేసినవాడు అవుతాడు.

టెస్టుల్లో మాత్రం విరాట్ కోహ్లీ చాలా వెనుకబడి ఉన్నాడు. ప్రస్తుతం టెస్టులో కోహ్లీ 27 సెంచరీలు మాత్రమే చేశాడు.

https://twitter.com/JosephVijayyy/status/1614584431670628361

'రన్ మెషిన్’ మళ్లీ ఆరంభం

విరాట్ కోహ్లీని క్రికెట్ అభిమానులు 'రన్ మెషిన్’ అంటే పరుగుల యంత్రంగా పిలుస్తుంటారు.

ఈ 'యంత్రం’ పరుగు మళ్లీ మొదలైందంటూ సోషల్ మీడియాలో యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.

2019లో నవంబరులో బంగ్లాదేశ్ మీద చేసిన టెస్టు సెంచరీ తరువాత సుమారు మూడేళ్ల పాటు విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేదు. చాలా కాలం పాటు ఫాంలో లేక పరుగులు చేయడానికి కోహ్లీ ఇబ్బంది పడ్డాడు.

ఫాంలో లేని కోహ్లీని ఇంకా ఎందుకు టీంలో ఉంచుతున్నారంటూ చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఆ కాలంలోనే కోహ్లీకి కెప్టెన్సీ కూడా దూరమైంది.

మొత్తానికి విరాట్ కోహ్లీ గత ఏడాది తిరిగి తన ఫాం అందుకున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్ మీద సెంచరీ చేయడం ద్వారా తన సత్తాను చాటాడు.

ఆ తరువాత ఈ ఏడాది బంగ్లాదేశ్ మీద ఒక సెంచరీ, శ్రీలంక మీద రెండు సెంచరీలు బాదాడు.

దీంతో 2023 కోహ్లీ సంవత్సరం అవుతుందని క్రికెట్ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Virat Kohli: Has this run machine started again?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X