Digital Currency India: పన్నుల పరిధిలోకి ఆ కరెన్సీ: భారీగా వడ్డింపు: 30% భారం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. లోక్‌సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. ఈ ఉదయం సరిగ్గా 11 గంటలకు ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభించారు. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలను చదవటం మొదలు పెట్టారు. ఈ సంవత్సరం మార్చి 31వ తేదీన ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 9.27 శాతంగా అంచనా వేసినట్లు చెప్పారు. దీన్ని అందుకుంటామనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. పలు పథకాలను ప్రకటించారు. మౌలిక రంగానికి పెద్ద పీట వేశామని అన్నారు.
పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట: అనూహ్యం.. కీలక నిర్ణయం
బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరటను ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ట్యాక్స్‌పేయర్లకు ఊపిరి పీల్చుకునే వెసలుబాటును ఇచ్చారు. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక లోపాలను దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ తాజా ప్రకటన చేశారు. ఎర్రర్లు, సాంకేతిక లోపాల వల్ల కోట్లాదిమంది పన్ను చెల్లింపుదారులు పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటోన్నందున వారికి ఊరట కల్పించే ప్రకటన చేశారు. ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి రెండు సంవత్సరాల వరకు గడువు ఇచ్చారు.

అదే సమయంలో- వర్చువల్, డిజిటల్ కరెన్సీపై భారీగా పన్ను భారాన్ని మోపారు నిర్మల సీతారామన్. ఏకంగా 30 శాతం మేర పన్నును విధిస్తున్నట్లు తన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా వెల్లడించారు. దీన్ని బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చారు. వర్చువల్-డిజిటల్ ఆస్తుల బదిలీలను పన్నుల పరిధిలోకి తీసుకొచ్చారు. వాటిపై పన్నులను వర్తింపజేయడం ఇదే తొలిసారి. ఒకేసారి 30 శాతం మేర భారాన్నిమోపడం వల్ల మార్కెట్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోన్నాయి.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా చేపట్టే అన్ని రకాల చెల్లింపులు, బదలాయింపులను నిర్మల సీతారామన్.. పన్నుల పరిధిలోకి తీసుకొచ్చారు. గత రెండు సంవత్సరాల వ్యవధిలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు విస్తృతంగా పెరగడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. బిట్‌కాయిన్, ఇథేరియం, డోజ్ కాయిన్.. వంటి క్రిప్టోకరెన్సీల లావాదేవీలు ఇక భారంగామారొచ్చని స్పష్టం చేస్తోన్నాయి.
Recommended Video
డిజిటల్ రుపీని అందుబాటులోకి తీసుకొచ్చిన సమయంలోనే- క్రిప్టోకరెన్సీపై 30 శాతం మేర పన్ను భారాన్ని విధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మార్కెట్‌లో ఈ అంశం చర్చనీయాంశమైంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications