‘వర్చువల్ ఐడీ ’వెరీ గుడ్: ఆధార్ హ్యాకింగ్‌పై తొలిసారి స్పందించిన నీలేకని

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఆధార్ డేటా హ్యాకింగ్‌పై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని తొలి స్పందించారు. ఆధార్‌ను అప్రతిష్టపాలు చేసేందుకే బురద జల్లుతున్నారని మండిపడ్డారు.

ఆధార్ గోప్యతపై ఎడ్వర్డ్ స్నోడెన్ సంచలన వ్యాఖ్యలు

ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అవార్డ్ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆధార్‌ను దుర్వినియోగం చేసేందుకు 'కల్పిత ప్రచారం' చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 నిర్మాణాత్మక అభిప్రాయం

నిర్మాణాత్మక అభిప్రాయం

ట్రిబ్యూన్ కేసులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావిస్తూ.. ఆధార్ పై నిర్మాణాత్మక దృష్టి లేకుండా.. ప్రతికూల అభిప్రాయాలతో చర్యలు కూడా ప్రతికూలంగానే ఉంటాయన్నారు. అందువల్ల ప్రజలు దానిపై నిర్మాణాత్మక అభిప్రాయాన్ని కలిగి ఉండటం మంచిందని స్పష్టం చేశారు.

 వర్చువల్ ఐడీ మంచి విషయం

వర్చువల్ ఐడీ మంచి విషయం

మరో వైపు యూఐడీఏఐ తాజా విధానాన్ని(వర్చువల్ ఐడీ) నందన్ నీలేకని స్వాగతించారు. ఈ వ్వవహారంలో ఆధార్ సంస్థ కీలక ప్రకటన చేసిందని ప్రశసించారు. ఇక ప్రతివారు తమ వర్చువల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చని, ఇది చాలా ముఖ్యమైన ఫీచర్లను అందిస్తోందని చెప్పారు.

 నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు

నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు

అంతేగాక, ఇకపై ఆధార్ నెంబర్‌ను కూడా వెల్లడి చేయాల్సిన అవసరం లేదని నందన్ నీలేకని చెప్పారు. అలాగే ఇతర ఏజెన్సీలు ఆధార్ నెంబర్లను సేకరించే అవకాశం కూడా ఉండదని అన్నారు.

సుప్రీం గుర్తిస్తుంది..

సుప్రీం గుర్తిస్తుంది..

ఆధార్‌ను సుప్రీంకోర్టు గుర్తిస్తుందనే నమ్మకం తనకుందని నందన్ నీలేకని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆధార్ వివరాల గోప్యత విషయంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో యూఐడీఏఐ.. తాజాగా వర్చువల్ ఐడీ, పరిమిత కేవైసీ కోడ్ అనే రెండంచెల వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవస్థ మార్చి ఒకటి నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Explaining how the new security layer works, Nilekani said, "This is a very significant announcement by the UIDAI and in some sense it makes the case against it go away. because it provides 2 or 3 very important features.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి