Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇన్ఫీని వీడుతున్న సిక్కా?: హెచ్‌పీఈతో డీల్.. మూర్తి చెప్పినట్లే ఆ పోస్టులో!

విశాల్ సిక్కా.. హెచ్‌పీఈ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐకానిక్ అమెరికన్ సంస్థ హెచ్‌పీఈ సిక్కాను తమ సంస్థలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

బెంగళూరు: ఇన్ఫోసిస్‌కు షాకిస్తూ సీఈవో పదవి నుంచి తప్పుకున్న విశాల్ సిక్కా.. హెచ్‌పీఈ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐకానిక్ అమెరికన్ సంస్థ అయిన హెచ్‌పీఈ సిక్కాను తమ సంస్థలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కంప్యూటర్ సాఫ్ట్ వేర్, చిప్ మేకర్ దిగ్గజమైన హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ ప్రైజ్(హెచ్ పీఈ)లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా(సీటీవో) సిక్కా చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇన్ఫీ సీఈవోగా సిక్కా రాజీనామాకు ముందు.. అతనికి సీఈవో కన్నా సీటీవో పోస్ట్ బెటర్ అంటూ సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

Vishal Sikka likely to join Hewlett Packard Enterprise as CTO

ఆయన వ్యాఖ్యలకు తగ్గట్లే ఇప్పుడు సిక్కా హెచ్‌పీఈలో సీటీవో పదవిలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ప్రస్తుతం ఇన్ఫీలో ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగుతున్నారు.

కాగా, హ్యూలెట్ ప్యాకర్డ్ నుంచి విడిపోయి 2015లో హెచ్‌పీఈ ఏర్పడింది. ఈ సంస్థలో 2లక్షల మంది ఉద్యోగులున్నారు. డేటా సెంటర్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను హెచ్ పీఈ విక్రయిస్తోంది. దాంతో పాటు హెచ్ పీ పర్సనల్ కంప్యూటర్స్, ప్రిటర్స్ కూడా అమ్ముతోంది.

హెచ్ పీఈ ప్రధాన కార్యాలయం పాల్ ఆల్టో. విశాల్ సిక్కా కూడా ఇదే ప్రాంతానికి చెందినవాడు కావడంతో హెచ్ పీఈలో చేరడానికే ఆయన మొగ్గు చూపుతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హెచ్‌పీఈకి ప్రస్తుతం మెక్ వైట్ మ్యాన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హెచ్‌పీఈలో సీటీవో పదవి ఖాళీగానే ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+