పెళ్లికి వెళ్లాలని ట్యాక్సీలు బుక్ చేసి ఐటీ శాఖ దాడులు, శశికళ ఫ్యామిలీకి మేలు జరుగుతుంది !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ శాఖ దాడులు జరుగుతుంటే శశికళ ఫ్యామిలీ మాత్రం ఎలాంటి ఆందోళన చెందలేదని ఆమె అనుచరులు అంటున్నారు.

ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చెయ్యడం వలన మనకు మేలు జరుగుతుందని శశికళ కుటుంబ సభ్యులు అంటున్నారని చిన్నమ్మ వర్గీయలు పైకి చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం శశికళ కుటుంబ సభ్యులను వేధిస్తోందని ప్రజల్లో సానుభూతి వస్తుందని ఆమె వర్గీయులు అంటున్నారు.

VK Sasikala family members is not upset over IT raids

బుధవారం రాత్రి మూడు నాలుగు ట్రావెల్స్ సంస్థలకు ఫోన్ చేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులు పెళ్లికి వెళ్లాలని చెప్పి ట్యాక్సీలు బుక్ చేసుకున్నారని గురువారం వెలుగు చూసింది. ఐటీ శాఖ అధికారులు శశికళ కుటుంబ సభ్యుల మీద దాడులు చెయ్యడానికి మొత్తం ట్యాక్సీలే ఉపయోగించారు.

ప్రభుత్వానికి చెందిన ఒక్క వాహనాన్ని ఐటీ శాఖ అధికారులు ఉపయోగించలేదు. ఆదాయపన్ను శాఖ అధికారుల కోసం కార్లు తీసుకెళ్లిన డ్రైవర్లు వెలుతున్ననది పెళ్లికి కాదని, ఐటీ దాడులకు అనే అసలు విషయం తెలుసుకుని షాక్ గురైనారు. అన్ని వాహనాల డ్రైవర్లు పలు ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు ఎప్పుడు బయటకు వస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AS Income tax raids were going all around Tamilnadu in the relatives house and offices of Sasikala, their family members were not upset over these raids because they feel that its a benefit for them.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి