‘నా భార్యకు ఓటెయ్యకుంటే కష్టాలు తప్పవు’: ముస్లిం ఓటర్లకు బీజేపీ కౌన్సిలర్ హెచ్చరిక

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత రంజిత్ కుమార్ శ్రీవాత్సవ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘స్థానిక ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తోంది.. ఆమెకు ఓటేయ్యలేదంటే.

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత రంజిత్ కుమార్ శ్రీవాత్సవ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'స్థానిక ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తోంది.. ఆమెకు ఓటేయ్యలేదంటే.. భవిష్యత్‌లో మీరు చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది' అని బీజేపీ కౌన్సిలర్‌ రంజిత్ ఓ బహిరంగ సభలో ముస్లింలను హెచ్చరించారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో నవంబర్ నెలాఖరున స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బరబంకి స్థానం నుంచి బీజేపీ కౌన్సిలర్‌ రంజిత్‌కుమార్‌ శ్రీవాస్తవ భార్య శశి శ్రీవాస్తవ పోటీ చేస్తున్నారు. ఆమె తరఫున రంజిత్‌ ప్రచారం చేస్తున్నారు.

Vote for Us or Face Difficulties, Uttar Pradesh BJP Leader Warns Muslims

ఈ నేపథ్యంలోనే బరబంకిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో రంజిత్ మాట్లాడుతూ..
'ఇదేమీ సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం కాదు. మీకు ఎవరూ సహాయం చేయలేరు. నా భార్యకు ఓట్లు వేసి గెలిపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే మాకు ఓట్లు వేయండి. మీరు మాకు ఓట్లేస్తే.. ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేదంటే కష్టాలు తప్పవు.' అని హెచ్చరించారు.

ఈ సభలో ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు దారాసింగ్‌ చౌహాన్‌, రమాపతి శాస్త్రి వేదికపైనే ఉన్నారు. కాగా, రంజిత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి చౌహాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అయితే, రంజిత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, నవంబర్‌ 22, 26, 29 తేదీల్లో యూపీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+