యూపీలో ఎస్పీకి షాక్.. పోలింగ్ బాయ్‌కాట్‌.. కంగుతిన్న అఖిలేశ్ సతీమణి

కన్నౌజ్ : తిరుగులేని చోట సమాజ్ వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ కుటుంబానికి షాక్ తగిలింది. ఊహించని పరిణామంతో కంగుతినాల్సి వచ్చింది. అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిలిచిన కన్నౌజ్ సెగ్మెంట్ లో ఓటర్లు ఝలక్ ఇచ్చారు. 20 ఏళ్ల నుంచి అభివృద్ధి జరగలేదన్న కోపం ఓవైపు.. పోలింగ్ కేంద్రాలను మార్చడం మరోవైపు ఓటర్లకు ఆగ్రహం తెప్పించింది.

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో పోలింగ్‌ను బాయ్‌కాట్‌ చేశారు ఓటర్లు. అయితే వరుసగా సమాజ్ వాదీ పార్టీయే ఇక్కడ విజయకేతనం ఎగురవేస్తుండటం ఆ పార్టీకి కంచుకోటలా మారింది. కానీ ఈసారి ఓటర్లు ఇలా రివర్స్ తిరగడం ఎస్పీ నేతలకు మింగుడుపడటం లేదు. ఇక ఇక్కడి నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ కు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు.

 Voters in Kannauj from where Dimple Yadav is contesting boycott polls

ఓటర్ల ఆగ్రహానికి ప్రధాన కారణ పోలింగ్ కేంద్రాలు మార్చడమే. 27, 29 పోలింగ్ బూత్ లను చివరి నిమిషంలో వేరే చోటికి మార్చడంతో స్థానికుల్లో అసహనం పెరిగిపోయింది. అంతేగాకుండా 20 ఏళ్ల నుంచి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్నారు. అలా పోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్పీకి వీపరీతంగా పట్టున్న ఈ నియోజకవర్గంలో ఇలాంటి వ్యతిరేకత రావడం ఇదే మొదటిసారి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+