వైష్ణో దేవి ఎవరిని కరుణిస్తుందో..!!
Jammu Kashmir Assembly election 2024: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ మొదలైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూలైన్‌లో వేచివున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు ఎన్నికల సిబ్బంది.
దశాబ్ద కాలం తరువాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం మూడు దశల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నెల 18వ తేదీన తొలిదశ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. రెండో విడతలో మొత్తం 26 నియోజకవర్గాల్లో 25 లక్షలమందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.

దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే పూర్తి చేసింది. మొత్తం 239 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. పోలింగ్ సజావుగా సాగడానికి ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేసింది. అలాంటి ప్రాంతాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ జరుగుతోంది.
ఇక్కడ ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య.. 90. నేడు.. కంగన్, గందర్‌బల్, హజ్రత్‌బాల్, ఖన్యార్, హబ్బకదల్, లాల్‌చౌక్, ఛన్నాపోరా, జడీబాల్, ఈద్గా, సెంట్రల్ షాల్టెంగ్, బుద్గామ్, బీర్వా, ఖాన్‌సాహిబ్, చాహర్-ఐ-షరీఫ్, చదూరా, గులాబ్‌ఘర్, రియాసి, శ్రీ మాతా వైష్ణో దేవి, కాలాకోటే-సుందర్‌బని, నౌషేరా, రాజౌరి, బుధాల్, థన్నామండీ, సురాన్‌కోట్, పూంచ్ హవేలీ, మెంధార్‌లలో పోలింగ్ కొనసాగుతోంది.
#WATCH | J&K Assembly elections: People await their turn to cast vote as voting for the second phase of elections begins. Voting being held in 26 constituencies across six districts of the UT today.
— ANI (@ANI) September 25, 2024
Visuals from Govt middle school in Shri Mata Vaishno Devi assembly constituency… pic.twitter.com/lFo17cfqBK
మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తోన్న రెండు నియోజకవర్గాలు- గందర్‌బాల్, బుద్గాంలల్లో పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా.. నౌషేరా నుంచి పోటీలో ఉన్నారు.
#WATCH | J&K Assembly elections: People queue up outside a polling station in Balhama, Srinagar to vote as polling for the second phase of elections begins.
— ANI (@ANI) September 25, 2024
Voting being held in 26 constituencies across six districts of the UT today. pic.twitter.com/q5wxemTJ5B
ప్రతిష్ఠాత్మకమైన శ్రీ మాతా వైష్ణో దేవి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బల్‌దేవ్ రాజ్ శర్మ పోటీలో నిలిచారు. అప్పీ పార్టీ అధినేత అల్తాఫ్ బుఖారీ- ఛన్నాపొరా, పీసీసీ అధినేత తారిఖ్ హమీద్ కర్రా- షాల్టాంగ్, మాజీ మంత్రులు, నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులు అలీ సాగర్- ఖన్యార్, రహీం రాథర్- చాహర్ ఐ షరీఫ్.. భవితవ్యం నేడే తేలిపోనుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications