ఈ సారి రాహుల్ వంతు.. జెండా విసిరిన వ్యక్తి, యువనేతపై పడిన జెండా
ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఈ సమయంలో భద్రతా వైఫల్యాలు బయటపడుతున్నాయి. సోమవారం మరోసారి అలాంటి ఘటన జరిగింది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. సోమవారం రాహుల్ కాన్వాయ్ వెళ్తుండగా ఒక వ్యక్తి రాహుల్ పైకి ఒక్కసారిగా జెండాను విసిరాడు. కారులో రాహుల్ పక్కనున్న విండో తెరుచుకుని ఉండడంతో ఆ జెండా ఏకంగా రాహుల్‌పై పడింది.
రాహుల్ గాంధీ వెనకాలనే సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్‌సింగ్ సిద్ధూ కూర్చుని ఉన్నారు. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ సునిల్ జాఖర్ కారు నడుపుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో దీనికి సంబంధించిన ఫీడ్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెండా విసిరిన వ్యక్తి రాహుల్‌కు అతి దగ్గరలో ఉండడం వీడియోలో కనిపిస్తోంది.

పంజాబ్‌లో ఇలా జరగడం ఇది రెండవసారి. కొద్ది రోజుల క్రితం పంజాబ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ సెక్యూరిటీ సమస్య వల్ల అక్కడి నుంచి వెనుదిరిగిన విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీకి కూడా ఇలాంటి అనుభవం ఎదురవడం గమనార్హం. పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని.. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ చన్నీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వివాదం రాజుకుంది. మిగతా సీఎం ఆశవాహులు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఇదీ కామనే.. కానీ ఇప్పుడు మాత్రం అసమ్మతి తప్పడం లేదు.
ఇటు ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి జనవరి 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను మాత్రం మార్చి 10న వెల్లడిస్తారు. పంజాబ్ పోలింగ్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. మిగతా పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ ప్రకటన చేసింది.












Click it and Unblock the Notifications