వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజాలు తెలుసుకోండి: శాంతకుమార్‌కు శివరాజ్

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణంతో భారతీయ జనతా పార్టీ పరువుపోయిందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు శాంతకుమార్‌ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాశారు. ఈ లేఖపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పందించారు.

ఆయన శాంతకుమార్‌కు మంగళవారం రాత్రి లేఖ ద్వారా జవాబిచ్చారు. నిజానిజాలు తెలియకుండా ప్రతిపక్షాలకు వంత పాడొద్దని లేఖలో పేర్కొన్నారు. వ్యాపం కుంభకోణం కేసును ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌కు అప్పగించినట్లు చౌహాన్‌ తెలిపారు.

ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేసిందన్నారు. నిజాయతీగా వ్యవహరిస్తున్న టాస్క్‌ ఫోర్స్‌ను సుప్రీం కోర్టు సైతం కొనియాడిందని శివరాజ్‌ తన లేఖలో పేర్కొన్నారు.

Shivraj Singh Chouhan

కాగా, శాంతకుమార్ తన లేఖలో ‘ఇటీవలి కాలంలో పార్టీని చుట్టిముట్టిన వివాదాలు పరువు తీస్తున్నాయి' అని అభిప్రాయపడ్డారు. రోజు రోజుకూ పార్టీలో వివాదాలకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటు కావాల్సి ఉందని చెప్పారు.

ఎథిక్స్ కమిటీ నియామకమూ జరగాలన్నారు. మధ్య ప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ.. దీంతో మనమంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజస్థాన్, మహారాష్ట్రలలో చెరరేగిన వివాదాలను కూడా ఆయన గుర్తు చేశారు.

English summary
After BJP veteran Shanta Kumar raised concerns over the Vyapam scam in Madhya Pradesh, Chief Minister Shivraj Singh Chouhan wrote a point-by-point rebuttal to Mr Kumar today, saying Vyapam was the propaganda of Congress, which was playing politics over scam-related deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X